జననేతగా వైసీపీ నాయకులు పదే పదే చెప్పుకొనే సీఎం జగన్ కు అదే జనాల నుంచి భారీ సెగ తగులుతోం ది. అది కూడా ఎన్నికల ముందు కావడం గమనార్హం. ఒకవైపు ఉద్యోగులు, మరో వైపు నిరుద్యోగులు.. ఇలా వరుస పెట్టి సర్కారుపై విరుచుకుపడుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం కదం తొక్కుతున్నారు. ఈ నెల 20 నుంచి పెన్ డౌన్‌కు వెనుకాడబోమని.. ఉద్యోగులు హెచ్చరించారు. ఇక, డీఎస్సీ సహా ఇతర ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కదం తొక్కుతున్నారు. మెగా డీఎస్సీ ఇవ్వాలంటూ అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థులు మంగళవారం మెరుపు ధర్నా చేపట్టారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి డీఎస్సీ అభ్యర్థులు అవనిగడ్డ వచ్చి శిక్షణ పొందుతున్నారు. ఈ క్రమంలో ఒకేసారి వందల సంఖ్యలో తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి అభ్యర్థులు నినాదాలు ప్రారంభించా రు. సున్నాలతో నోటిఫికేషన్ వద్దని వెంటనే ఇచ్చిన హామీ మేరకు మెగా నోటిఫికేషన్ ఇవాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ అభ్యర్థులకు బాసటగా టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ కూడా రంగంలోకి దిగారు. ఆయన నేతృత్వంలో తెలుగుదేశం, జనసేన నేతలు ఆందోళనలో పాల్గొన్నా రు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేవారు.
అయితే.. ఈ విషయం తెలిసిన పోలీసులు తహశీల్దార్ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. వెనక్కు వెళ్ళాలన్న పోలీసుల అభ్యర్థనను తిరస్కరించి మరీ అభ్యర్థులు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ హామీలే ఎసరు! ఏపీ సీఎం జగన్.. ప్రజలకు ఎన్నో మేళ్లు చేశానని చెబుతున్నా.. 2019 ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన కీలకమైన రెండు హామీలే ఇప్పుడు ఆయనకు తీవ్రస్థాయిలో సెగ పెడుతున్నాయి. ఉద్యోగులకు ప్రాణసంకటంగా మారిన సీపీఎస్ ను వారంలో రద్దు చేస్తామని హామీ. మెగా డీఎస్సీ వేసి.. లక్ష మంది నిరుద్యోగులను టీచర్లను చేస్తానని చెప్పడం. కానీ, ఈ రెండు హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో సీఎంజగన్‌కు ఇప్పుడు.. జనాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.