టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఈ ఏడాది జనవరి 27న ప్రారంభించిన యువగళం పాదయాత్ర తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ పాదయాత్ర 3వేల కిలో మీటర్ల మైలురాయిని పూర్తిచేసుకుంది ఈ సందర్భంగా నారా లోకేష్ పైలాన్‌ను ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హాజరయ్యారు. పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన ‘యువగళం’ పాదయాత్రకు ప్రభుత్వం, వైసీపీ నాయకుల నుంచి అవరోధాలు ఎదురైనా లోకేష్ ప్రజాగళం వినిపిస్తూ ముందుకు సాగారు.
పది ఉమ్మడి జిల్లాల్లో 92 నియోజకవర్గాల మీదుగా సాగిన యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మలికిపురం మండలం దిండి వద్ద సెప్టెంబరు 8న యాత్ర ప్రవేశించింది. మర్నా డు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పాదయాత్ర 79 రోజులపాటు ఆగింది. గత నెల 26న యాత్ర పునఃప్రా రంభించారు. అన్నివర్గాలూ పాదయాత్రకు నీరాజనం పలికాయి. కాగా, ఈ నెల 19న పాదయాత్రను ముగించనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు జనసేన అధినేత పవన్ కూడా రానున్నారు.
చారిత్రాత్మక మైలురాయిని అధిగమించిన యువగళం పాదయాత్ర
3వేల కి.మీ. అధిగమించిన చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా తుని యనమల గెస్ట్ హౌస్ వద్ద పైలాన్ ను ఆవిష్కరించిన యువనేత లోకేష్, కార్యక్రమానికి హాజరైన నారా బ్రాహ్మణి, దేవాన్ష్,
మోక్షజ్ఞ, భరత్.
తుని నియోజకవర్గం తేటగుంట వద్ద పండుగ… pic.twitter.com/wPhRB3nc5H— Telugu Desam Party (@JaiTDP) December 11, 2023