తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రులకు శాఖలను కేటాయిస్తూ రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన విడుదల చేశారు. 11 మంది మంత్రులకు శాఖలను కేటాయిస్తూ తాజాగా ప్రకటన వెలువడింది. డిప్యూటీ సీఎం మల్లు పట్టే విక్రమార్కకు రెవెన్యూ శాఖ దక్కింది. ఉత్తమకుమార్ రెడ్డికి హోం శాఖను రేవంత్ కేటాయించారు. రేవంత్ తో ఈ ఇద్దరు సీఎం రేసులో పోటీ పడ్డ సంగతి తెలిసిందే.
ఇక, డిప్యూటీ సీఎం పదవి లేదా హోమ్ శాఖ దక్కుతుందని అనుకున్న సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు. ఇక, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తొలి కేబినెట్ భేటీ జరగనుంది. మరోవైపు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు, తెలంగాణ ఇంటిలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డిని నియమించారు.
మరోవైపు, హోటల్ తాజ్ కృష్ణ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఖర్గేలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కేబినెట్ కూర్పుతోపాటు పలు విషయాలపై వీరు చర్చించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత వారు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు.
మంత్రులకు శాఖల వారీగా కేటాయింపు ఇలా…
మల్లు భట్టి విక్రమార్క – డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డి – హోం
శ్రీధర్ బాబు – ఆర్థిక శాఖ
తుమ్మల నాగేశ్వరరావు – రోడ్లు, భవనాల శాఖ
జూపల్లి కృష్ణారావు – పౌర సరఫరాల శాఖ
దామోదర రాజనర్సింహ – ఆరోగ్య శాఖ
పొన్నం ప్రభాకర్ – బీసీ సంక్షేమ శాఖ
సీతక్క – గిరిజన సంక్షేమ శాఖ
కొండా సురేఖ – స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
కోమటిరెడ్డి వెంకటరెడ్డి – పురపాలక శాఖ
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – నీటిపారుదల శాఖ