ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. దాదాపు పదేళ్లుగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ ను ఊరిస్తున్న తెలంగాణ సమాజం.. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో పట్టంకట్టేందుకు సిద్ధంగా ఉన్న ఎగ్జిట్ పోల్ సర్వేలు.. ఆ పార్టీలో నూతనోత్తేజాన్ని నింపాయి. దీనికితోడు.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నిలదొక్కుకుని మోడీ సర్కారుపై యుద్ధం చేయాలన్న కాంగ్రెస్‌కు 17 పార్లమెంటు స్థానాలున్న తెలంగాణ అత్యంత కీలకం. పైగా.. వస్తే.. గిస్తే.. ఒక్క ఒంటరిగానే వచ్చే అవకాశం ఉందని లెక్కలు వేసుకుంటున్నారు.
ఇది ఒకరకంగా కాంగ్రెస్‌కు అత్యంత కీలకమైన విజయమే అవుతుంది. దీంతో తెలంగాణలో వచ్చిన వస్తు న్న ఒకే ఒక్క ఛాన్స్‌ను ఎట్టి పరిస్థితిలోనూ మిస్ చేసుకోకూడదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ అధిష్టానం నుంచి కీలక నాయకులకు ఫోన్లు వస్తున్నాయి. “ఇప్పుడు పార్టీ కీలక పొజిష న్లో ఉంది. అందరూ సహకరించాలి. ఈ ఒక్క ఛాన్స్‌ను మనం వంద ఛాన్స్లుగా మార్చుకునేందుకు మీ సహకారం అవసరం“ అని పార్టీ అధిష్టానం నుంచి నాయకులకు ఫోన్లు వస్తుండడం గమనార్హం.
దీనికి ప్రధాన కారణం.. జంపింగుల బెడద పొంచి ఉందని పార్టీ అంతర్గత చర్చల్లో ప్రధానంగా తెరమీదికి వస్తుండడమే. అయితే.. ఇలాంటి పరిస్థితి ఎప్పటికీ జరగకూడదని.. మళ్లీ పార్టీ కనుక ప్రతిపక్షానికే పరిమి తమే ఇక, ఐదేళ్లపాటు మరిన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుందని.. పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాకూర్ అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నారు. అయితే.. పైకి మాత్రం పరిస్థితులు గుంభనంగా ఉన్నాయి.
క్షేత్రస్థాయిలో నాయకులు కూడా.. తమ విజయంపై ధైర్యంగానే ఉన్నప్పటికీ.. పదువులు, పీఠాల విష యంలో మాత్రం అంతర్గతంగా మథన పడుతున్నారు. “పదేళ్లు పార్టీలో ఉన్నాం. కేసులు పెట్టించుకు న్నాం. ఇప్పటికైనా గుర్తింపు వస్తే.. మంచిదే. రాకపోతే ఎలా?“ అని వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇక, ఉమ్మడి ఖమ్మంలోనూ ఇదే మాట వినిపించింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ముందుగానే రెడీ అయి.. నేతలపై సెంటిమెంటు అస్త్రం ప్రయోగిస్తుండడం గమనార్హం.