కీలక వేదికల నుంచి కఠిన వాస్తవాల్ని చెప్పటం అంత తేలికైన విషయం కాదు. అందునా.. భారీ ఇమేజ్ ఉన్న ప్రముఖులు వాస్తవాల్ని మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడరు. నాలుగు గోడల మధ్య అనధికారికంగా తమ అభిప్రాయాల్ని వెల్లడించేందుకు ఇష్టపడే వారిని చూస్తుంటాం. అందుకు భిన్నంగా కీలక వేదిక నుంచి కఠినంగా ఉండే నిజాల్ని వెల్లడించటం సాహసోపేతమైన చర్యగా చెప్పక తప్పదు. తాజాగా అలాంటితీరునే ప్రదర్శించారు కాంతార హీరో కమ్ నిర్మాత రిషబ్ శెట్టి.
కరోనా పుణ్యమా అని అందరికి సుపరిచితమైన ఓటీటీ ఫ్లాట్ పాం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు రిషిబ్ శెట్టి. గోవా వేదికగా జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకకు అతిధిగా హాజరైన ఆయన.. కీలకవ్యాఖ్యలు చేవారు. ఎన్ ఎఫ్ డీసీ .. ఫిలిం బజార్ లాంటి వేడుకల్లో ప్రదర్శిస్తేనే కన్నడ సినిమాలకు ఆదాయం వచ్చేదని.. కొవిడ్ వేళ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వినియోగం పెరిగిందన్నారు.
ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవన్న రిషిబ్.. ఓటీటీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నడలో నిర్మించిన ఒక కమర్షియల్ మూవీకి అనుకున్నంతగా హిట్ కాకపోవటంతో ఓటీటీ సంస్థలు ఆ సినిమాను తీసుకునేందుకు ముందుకు రాలేదన్నారు. సినిమా హిట్ కాకుంటే కన్నడ సినిమాలను ఓటీటీలు నో చెబుతున్నట్లుగా పేర్కొన్నారు.‘ఇది బాధాకరం’ అన్న ఆయన.. కాంతార మూవీ గురించి మాట్లాడారు.
కన్నడ ప్రజలు కాంతార మూవీని ఆదరించిన తర్వాతే ఇతర భాషల్లో డబ్ అయ్యిందన్న ఆయన నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్య ఒకటి వచ్చింది. ‘‘ఇతరుల మాదిరి ఒక సినిమా హిట్ అయిన వెంటనే కన్నడ చిత్రపరిశ్రమను నేను విడిచి పెట్టాలని అనుకోవటంలేదు. కాంతార సినిమా క్రెడిట్ కన్నడ ప్రేక్షకులదే. వారు హిట్ చేయకపోతే ఇతర భాషల్లో ఆ సినిమా డబ్ అయ్యేది కాదు. కాంతార తర్వాత నాకు ఇతర చిత్రపరిశ్రమల నుంచి ఛాన్సులువచ్చాయి. కానీ.. నేను వాటిని రిజెక్టు చేశా. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాలు చూస్తారు’’అని వ్యాఖ్యానించారు.
కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1 గురించి తాను మాట్లాడాలని అనుకోవటం లేదని.. ప్రేక్షకులే తన సినిమా గురించి మాట్లాడాలన్నారు. తన టీం మొత్తం సినిమా మీదనే ఫోకస్ చేసినట్లు చెప్పిన రిషిబ్.. కాంతార షూటింగ్ సమయంలోనే సీక్వెల్ ఆలోచన చేసినట్లుగా చెప్పారు. ఇటీవల విడుదలైన టీజర్ ఆసక్తికరంగా మారి.. తాజా ప్రాజెక్టు హాట్ టాపిక్ గా మారింది.