సీఎం జగన్ ఏపీ ప్రజలకు అప్పు చేసి పప్పుకూడు పెడుతున్నారని, పథకాల కోసం పప్పు బెల్లాల మాదిరిగా ఖజానాలోని డబ్బులను పెంచకుండా పంచుతున్నారని తీవ్రస్థాయిలో ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు రాకుండా, ఆదాయం పెరగకుండా, సంపద సృష్టించకుండా రాష్ట్రాన్ని డెవలప్ చేయడం సాధ్యం కాదని విపక్ష నేతలు నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇవే విషయాలను ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ ప్రజలందరికీ అర్థమయ్యే భాషలో చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏపీ ఆర్థిక దుస్థితిని జింబాబ్వేతో పోలుస్తూ ఆయన చెప్పిన మాటలు వైరల్ గా మారాయి.
‘‘ఖజానాలోని డబ్బులన్నీ పథకాలకు వెళ్లిపోతున్నాయి…ఆదాయం లేదు…జింబాబ్వేలాగా ఏపీ పరిస్థితి మారే అవకాశముంది…పథకాలు అవసరం ఉన్నోళ్లకు వెళ్లాలి…అడిగినోడికి, అడగనోడికి అందరికీ ఎందుకు? ఉచిత పథకాల వల్ల నష్టం ఎక్కువ…. అన్ని దేశాలలో తిరిగాను..కాబట్టి చెబుతున్నాను…వాడుక భాషలో సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాను…ఫ్రీగా పథకాలు తీసుకుంటే నాశనమయ్యేది ప్రజలే….రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తుంది….జగన్,చంద్రబాబు, పవన్ అంటే తనకు గౌరవం ఉంది…ఎవరినీ కించపరిచేందుకు ఈ వీడియో చేయలేదు’’ అంటూ నా అన్వేషణ తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
నా అన్వేషణ చెప్పిన మాటల పూర్తి వీడియో లింక్