బీజేపీ రాజకీయ, భావజాల ప్రయోజనాల పరిరక్షణకోసం ప్రధాని నరేంద్రమోదీని తప్పించాలని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్‌ను సీనియర్ ఆర్ఎస్ఎస్ నాయకులు ఒత్తిడిచేస్తున్నారు.
నరేంద్ర మోదీ వ్యవహారసరళి సక్రమంగా లేదని ఆయన తక్షణ తప్పుకోవలసిందిగా కోరాలని భగవత్‌ను వీరు కోరుతున్నారు.
చాలాకాలంగా మోదీ జాతీయ సమస్యలపై అనుసరిస్తున్న వైఖరిపై ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అయితే బహిరంగంగా విమర్శించకూడదన్న ఆర్ఎస్ఎస్ విధానాన్ని అనుసరించి భగవత్ మీదనే వత్తిడి పెడుతున్నారు.
అంతర్గతంగా మోదీ విధానాలను విమర్శిస్తున్నారు.
ఈ విషయాన్ని ఈ సంవత్సరం మే నెల ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ సంపాదకీయంలో స్పష్టంగా పేర్కొన్నారు.
మోదీ కనీసం తన విధానాన్ని మార్చుకుని సహేతుకంగా పనిచేయగలరని సంపాదకీయంలో ఆశించారు.
అయితే ఆర్ఎస్ఎస్ ఆశించినవిధంగా జరగడంలేదు.
ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మోదీ అనుసరిస్తున్న పద్ధతులు తమ విశ్వాసాన్ని నిర్ధారణ చేశాయని సీనియర్ నాయకులు చెబుతున్నారు.
మోదీ నాయకత్వంలో బీజేపీ సరైన రాజకీయ మార్గాన్ని తప్పినడుస్తున్నదని ఈ నాయకులు విమర్శిస్తున్నారు.
మోదీ సీనియర్ నాయకులను పక్కనబెట్టడం వల్ల ఎక్కువభాగం ఆర్ఎస్ఎస్ ప్రతిష్ట దెబ్బతినిపోయిందని వీరు విమర్శిస్తున్నారు.
విచ్ఛిన్నకర రాజకీయాలను అనుసరించవద్దని ఆర్ఎస్ఎస్ ముందుగానే తగుచర్యలు తీసుకుని మోదీని ఆదేశించవలసిందని ఈ నాయకులు అంటున్నారు.
మోదీని తగినవిధంగా నడిపించడంలేదని కొంతమంది సీనియర్ నాయకులు భగవత్‌ను కూడా విమర్శిస్తున్నారు.
ఆర్గనైజర్ మే నెల సంపాదకీయంలో హెచ్చరించిన తర్వాత మోదీ మరింత విచక్షణతో వ్యవహరిస్తారని రాష్ట్రస్థాయిలో ఉండే నాయకులకు కూడా ప్రాధాన్యత ఇస్తారని భావించారు.
అయితే మోదీ మాత్రం తానొక్కడినే బీజేపీ నాయకుడిగా తననుతాను ప్రదర్శించుకుంటున్నారని ఈ నాయకులు చెబుతున్నారు.
మోదీ క్రమక్రమంగా ప్రజాభిమానాన్ని, తన ప్రతిష్టను కోల్పోయారని కావాలని సీనియర్ నాయకులను అవమానిస్తున్నారని, ఇప్పటికీ తనధోరణి ఏమీమారలేదని ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతున్నదని వారు విమర్శిస్తున్నారు.
బీజేపీ సంక్షోభంలో ఉన్నకాలంలో, పార్టీ తిరిగి కోలుకునేట్లుచేసిన నాయకుడుని తాను ఒక్కడినేనని భావిస్తున్నారు. స్వీయప్రతిష్టను పెంచుకునేందుకు అన్నివిధాలుగా మోదీ ప్రయత్నిస్తున్నాడని అసహనం వ్యక్తంచేస్తున్నాడని అంటున్నారు.
చత్తీస్‌ఘడ్‌లో రమణ్‌సింగ్, మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్, రాజస్థాన్‌లో వసుంధర రాజేలను మోదీ, అమిత్‌షాలు కావాలని విస్మరించారని, ఈ నాయకులనుంచి మోదీకి ఎలాంటి తీవ్రమైన ముప్పు లేదని ఈ నాయకులు అంటున్నారు.
వసుంధర రాజె ఒక సేవకురాలిపాత్ర నిర్వహించడానికి ఇష్టపడదు.
అందువల్లనే ఆమెను పట్టించుకోలేదు.
మోదీ అహంభావంతో ఉంటారు.
ఆత్మగౌరవంతో మెలగరు అని సీనియర్ నాయకులు అంటున్నారు.
ఆయనవద్ద ఉండే ఆలోచనాపరులు, సలహాదారుల సూచనలమేరకు తానే గొప్పవాడినని చాటుకునే భావన కొంతమేరకు తగ్గినప్పటికీ ఇప్పటికే తిరిగి బాగుచేయలేనంతగా పార్టీ నష్టపోయిందని వారు పేర్కొంటున్నారు.
నిరాకరణ, అహంభావ ధోరణి కలిగిన మోదీ కారణంగా క్షేత్రస్థాయిలోని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సంఘానికి దూరమయ్యారని ఆ సంస్థలోని కొన్ని వర్గాలు వెల్లడిరచాయి.
ఎన్నికల్లో పోటీచేయడానికి అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చే సమయంలో ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులు సూచించిన వారికి అమిత్‌షా అవకాశం ఇవ్వలేదని కావాలనే ఇలా వ్యవహరించారని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి.
ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులపై వ్యతిరేకత క్షేత్రస్థాయి కార్యకర్తలపై తీవ్రప్రభావం చూపింది.
దిగువస్థాయి కార్యకర్తలు అంతా బాగానే ఉన్నారని చెబుతూ జరిగిన నష్టాన్ని పైకి చెప్పడంలేదు.
బీజేపీ అభ్యర్థులు గెలుపొందుతారని మాత్రమే మాట్లాడుతున్నారు.
2009లో జరిగినట్లుగానే ఇప్పుడుకూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎంపిక చేసుకున్న ప్రాంతాలలోనే ఓటింగ్‌లో పాల్గొననున్నారు.
2024 లోకసభ ఎన్నికల్లో మోదీ గెలవాలని కొంతమంది ఆర్ఎస్ఎస్ నాయకులు కోరుకోవడంలేదు.
ఆర్ఎస్ఎస్ సీనియర్ సిద్ధాంతకర్త ఎంజి వైద్య 2021లో అతిముఖ్యమైన వివాదాస్పద విషయాన్ని వెల్లడిరచారు.
బీజేపీ అధ్యక్షుడిగా నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలని రామ్జెఠల్మాని వివాదంచేయడం వెనుక అప్పటి ముఖ్యమంత్రి మోదీ ఉన్నారని వైద్య అసలు విషయాన్ని బైటపెట్టారు.
అప్పుడు ఆర్ఎస్ఎస్ వైద్యను దూరంపెట్టింది.
అయితే ఆయనను దూరంగా ఉంచడంవల్ల పార్టీకి ఆ తరువాత తీవ్రనష్టం జరిగింది.
దాదాపు బీజేపీ సీనియర్ నాయకులంతా ఆయనను ఆదరించలేదు.
అందువల్లనే ఇప్పుడు విమర్శిస్తున్న సీనియర్ నాయకులు బహిరంగంగా విమర్శించడంలేదు.
ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ నాయకత్వం వైద్యకు దూరంగానే ఉన్నది.
అయితే ఆయన మాత్రం తాను వెల్లడిరచినదాని కట్టుబడి ఉన్నారు.
ఎల్‌కె అద్వాని, నితిన్ గడ్కరీ తాము ప్రధానమంత్రి పదవిని అభిలషించడంలేదని బహిరంగంగానే ప్రకటించారు.
అయితే తనకు ప్రధాని పదవి కావాలని నరేంద్ర మోదీ కోరలేదన్న వార్తలను ఎక్కడా నేను చదవలేదు అని వైద్య అన్నారు.
గడ్కరీ రాజీనామా, అదే సమయంలో నరేంద్ర మోదీ ప్రధాని కావాలన్న డిమాండ్‌ను జెఠ్మలానీ చేశారని ఈ విషయంలో అనవసరమైన సందేహాలు గుజరాత్లో ఉన్నాయని వైద్య చెప్పారు.
మోదీ అనుచరులు వెంకయ్యనాయుడు స్పందిస్తూ ‘‘నేను కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుడిని.
అర్ఎస్ఎస్లో 40ఏళ్లుగా పనిచేస్తున్నాను.
అలాంటి భావాలను నేను ఏ రోజు వెలువరించలేదు.
పైగా ఆ భావన ఆర్ఎస్ఎస్ అధికారమైనది కాదు.
ఈ విషయం స్పష్టంగా చెబుతున్నాను.
నాకు తెలిసినంతవరకు, స్వయంసేవక్‌గా నా అవగాహనమేరకు అలాగే బీజీపీ కార్యకర్తగా అలాంటి వార్తలను విశ్వసించబోను.
అయితే ఈ మొత్తం వ్యవహారంపైన మోహన్ భగవత్ మౌనంగానే ఉన్నారు.
2013లో ప్రధాని అభ్యర్థిగా ఆర్ఎస్ఎస్ ఎంపికచేసింది.
ఆయన ఆర్ఎస్ఎస్పై విశ్వాసంగా ఉన్నారా లేదా అనేది చర్చించవలసింది.
బీజేపీ ప్రతినిధికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను, ధనాన్ని ఎన్నికల సమయంలో సమకూర్చాలని కూడా ఆ సంస్థ నిర్ణయించింది.
మోదీని భగవత్ పెద్ద భూతంలా తయారు చేశాడన్న విషయం తిరస్కరించలేనిది.
ఆర్ఎస్ఎస్ విభాగమైన బీజేపీ ఉనికినే మోదీ నాశనం చేస్తాడని సంఫ్‌ు సీనియర్ నాయకులు భావిస్తున్నారు.
ఒకవైపు మోదీ వ్యక్తి ఆరాధన సంస్కృతిని పెంచిపోషిస్తున్నప్పటికీ భగవత్ పట్టించుకోవడంలేదని కూడా సీనియర్ నాయకులు భావిస్తున్నారు.
2020 ఫిబ్రవరిలో సురేష్ జోషి (భయ్యాజి) హిందూమతంతో బీజేపీ సమానంకాదని హెచ్చరించారు.
హిందువుల తరఫున ఆర్ఎస్ఎస్ మాత్రమే మాట్లాడుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఆయన హెచ్చరిక ప్రభావం మోదీపైన ఏ మాత్రంలేదు.
ఆధ్యాత్మిక లేదా సాంస్కృతిక ముసుగులో హిట్లర్, ముస్సోలినీ ఫాసిజంను అనుసరించలేదుగానీ మోదీ మాత్రం హిందుత్వ, జాతీయవాదం ముసుగులో ఫాసిజంను ఆచరిస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ మాత్రం ఇండియాను హిందూ రాష్ట్రంగా మార్పుచేయాలన్న ప్రణాళిక రూపొందించుకుంది.
అయితే ఇది మోహన్ భగవత్కంటే గొప్పనాయకుడిగా తననుతాను మార్చుకునేందుకు వీలు కల్పించింది.
ఆర్ఎస్ఎస్ను ఇష్టమైన నినాదంగా మార్చుకున్నారు.
విచ్ఛిన్నకర రాజకీయాలను కొనసాగిస్తూనే ఉన్నారు.
మోదీ తప్పులు చేస్తున్నప్పటికీ భగవత్ మౌనంగానే ఉంటున్నారు.
ఆరు నెలలక్రితం భగవత్ వద్దకు బీజేపీ ఉన్నతస్థాయి నాయకులువెళ్లి మాట్లాడారు.
మోదీ ఇష్టంవచ్చినట్లుగా చర్యలు సాగిస్తున్నారు.
వాటిని అదుపుచేయండి అని హెచ్చరించినప్పటికీ వాటిని విస్మరించారు.
మూడవసారి ప్రధానమంత్రి పదవిని మోదీకి ఇవ్వరాదని అనేకమంది సంఫ్‌ు నాయకులు కోరుతున్నారని తెలుస్తోంది.