వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఎన్టీఆర్ కుమార్తెలను లక్ష్యంగా చేసుకుని సాయిరెడ్డి, వైసీపీ నేతలు, సోషల్ క్యాడర్ అవాకులు చెవాకులు మాట్లాడుతుండడంతో అయ్యన్నపాత్రుడు ఆగ్రహించారు. ఎన్టీఆర్ కుటుంబంలోని మహిళల గురించి కాకుండా జగన్ తల్లి, చెల్లెలు ఏమయ్యారో… ఎక్కడున్నారో జగన్ను వెళ్లి అడుగు సాయిరెడ్డీ అంటూ మండిపడ్డారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. పురంధేశ్వరి ఏపీలో ఇసుక, మైనింగ్, మద్యం మాఫియా జరుగుతుందని పదేపదే ప్రభుత్వంపై విరుచుకుపడుతుండడంతో సాయిరెడ్డి ఆమెపై ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాదు మద్యం విక్రయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సైతం ఫిర్యాదు చేశారు పురంధేశ్వరి. అప్పటి నుంచి విజయసాయిరెడ్డి బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని రాజకీయ పరంగానూ.. వ్యక్తిగతంగానూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ విమర్శలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు స్పందించారు.
ఉదయం లేస్తే ఇంట్లో ఆడవాళ్ళ పై పడి ఏడుస్తావ్ ఏంటి సాయిరెడ్డి అని నిలదీశారు. నారా భువనేశ్వరి,దగ్గుబాటి పురంధరేశ్వరిల గురించి ఏడవడం మానేయ్ అని సూచించారు. నీకు ధైర్యం ఉంటే విజయలక్ష్మి, షర్మిల ఎక్కడ? బాబాయ్ వివేకా ఎక్కడ అని జగన్ని అడుగు కసాయి రెడ్డి.. అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు సూచించారు. ‘ఉదయం లేస్తే ఇంట్లో ఆడవాళ్ళ పై పడి ఏడుస్తావ్ ఏంటి సాయిరెడ్డి. భువనేశ్వరి గారు, పురంధరేశ్వరి గారి గురించి ఏడవడం మానేయ్. నీకు ధైర్యం ఉంటే విజయలక్ష్మి, షర్మిల ఎక్కడ? బాబాయ్ వివేకా ఎక్కడ అని జగన్ ని అడుగు కసాయి రెడ్డి!’ అని అయ్యన్నపాత్రుడు ఆదివారం ట్వీట్ చేశారు.
మరి.. దీనికి సాయిరెడ్డి ఏం రిప్లయ్ ఇస్తారో చూడాలి.