ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అసదుద్దీన్ పైజామా కింద ఖాకీ నిక్కర్ వేసుకొని బీజేపీకి మద్దతిస్తున్నారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డికి అసదుద్దీన్ సోదరుడు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి తమ జోలికి వస్తే ఆయన జీవిత చరిత్ర బట్టబయలు చేస్తామని హెచ్చరించారు.
తనపై, తన అన్న అసదుద్దీన్ పై విమర్శలు చేయొచ్చని, తన తమ్ముడికి రాజకీయాల గురించి తెలియదని, తమ కుటుంబం జోలికి రావొద్దని హెచ్చరించారు. ఆర్ఎస్సెస్ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి, ఆ తర్వాత టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారని చెప్పారు. తెలంగాణలో రెడ్డి, రావు… ఎవరైనా సరే మా ముందు వంగాల్సిందే అని అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ – ముస్లిం గొడవలు తీసుకువచ్చిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. నెహ్రూ దేశ విభజన వల్లే భారత్ – పాకిస్తాన్ రెండు ముక్కలైందని ఆరోపించారు.