“అవే చెప్పులు మిమ్మల్ని తరిమి కొడతాయ్!!“ అంటూ టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. వైసీపీ నాయకులను ఉద్దేశించి తీవ్రస్థాయిలో మండి పడ్డారు. తాజాగా చేసిన ట్వీట్లో వైసీపీ పాలనపై నారా లోకేష్ నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో తెలుగు యువత అధికార ప్రతినిధి మంద విజయ్‌గోపాల్‌పై దాడి జరిగిం ది. వైసీపీ నాయకులు కొందరు.. ఆయనను చెప్పులతో కొట్టారు. దీంతో విజయ్‌గోపాల్ తీవ్రంగా గాయప డ్డారు. ఈ విషయం తెలిసి కూడా పోలీసులు మౌనంగా ఉన్నారని.. కనీసం కేసు కూడా నమోదు చేయలేదని.. పైగా విజయ్గోపాలపైనే తిరిగి కేసులు పెట్టారని పార్టీ నేతలు విమర్శించారు. కాగా, ఈ పరిణామాలపై నారా లోకేష్ సీరియస్ అయ్యారు.
‘‘విజయ్ గోపాల్‌ను చెప్పులతో కొట్టిన వైసీపీ సైకోలను అవే చెప్పులతో ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అధికార పార్టీ నేతలు ఫ్యాక్షనిస్టుల కంటే ఘోరంగా దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కావాలంటే.. మీరుకూడా వైసీపీ చొక్కాలు ధరించండి’’ అని లోకేష్ నిప్పులు చెరిగారు. బాధితులపైనే రివర్స్ కేసులు బనాయించడం సిగ్గుచేటని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.