తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒకవైపు నాయకులు, పార్టీలు ప్రచారంలో దూసుకుపోతూ.. ప్రత్య ర్థులకు కౌంటర్ ఇచ్చే అంశాలపైనే దృష్టిపెట్టారు. క్షణం తీరిక లేకుండా నాయకులు దూకుడుగా వ్యవహరి స్తున్నారు. అయితే, వీరి అటెన్షన్‌ను ఐటీ శాఖ ఛిద్రం చేస్తోంది. ఎన్నికల వేళ కీలక నాయకులు, వ్యాపార వేత్తలు, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖుల ఇళ్లపై వరుస దాడులు చేస్తోంది. ఎప్పుడు ఎటు నుంచి వస్తారో తెలియకుండా ఆకస్మిక దాడులు చేస్తుండడంతో నాయకులు బెంబేలెత్తుతున్నారు.
నిన్న మొన్నటి వరకు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి సుధాకర్ ఇంటిపై దాడులు చేసిన ఐటీ.. ఉరుము లు లేని పిడుగు మాదిరిగా తెలంగాణ మహిళా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇళ్లు, ఆమె కార్యాలయంతో పాటు ఆమె బంధువల ఇళ్లపైనా దాడులు చేస్తోంది. సోమవారంతెలతెల వారుతుండగానే రంగంలోకి దిగిన ఐటీ బృందం.. ఈ దాడులను ప్రారంభించింది. ప్రస్తుతం సబితా ఇంద్రాడ్డి మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలోను తర్వాత బీఆర్ ఎస్‌లోనూ సబిత కుటుంబం ఉంది. అయితే.. ఇన్నేళ్లలో ఎప్పడూ కూడా ఐటీ దాడులు ఎరిగి ఉండలేదు. గతంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కేసుల్లో మాత్రమే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆతర్వాత దీనిని క్వాష్ చేశారు. ఇక, ఇతర నేతల్లా ఆమె కూడబెట్టుకున్నారనే విమర్శలు కూడా ఎప్పుడూ వినిపించలేదు. కానీ, తాజాగా ఐటీ దాడులు జరగడంతో సబిత అనుచరగణం విస్తుపోతున్నారు. చివరకుఐటీ అధికారులు ఏం తేలుస్తారో చూడాలి.