ఐదేళ్ల కిందట ‘ఆర్ఎక్స్ 100’ సినిమా ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఈ చిత్రంతో హీరో కార్తికేయ, దర్శకుడు అజయ్ భూపతిలకు చాలా మంచి పేరొచ్చింది కానీ.. సినిమాలో అసలు సిసలైన సంచలనం అంటే కథానాయిక పాయల్ రాజ్‌పుతే. అలాంటి పాత్రను అందరు హీరోయిన్లూ ఒప్పుకోరు. ఒప్పుకున్నా అంత బోల్డ్ క్యారెక్టర్‌ను కన్విన్సింగ్‌గా ఆ పాత్రను పోషించడం అందరి వల్లా కాదు.
కానీ పాయల్ మాత్రం ఆ పాత్రలో సెన్సేషనల్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను మాత్రం పాయిల్ సరిగా ఉపయోగించుకోలేకపోయింది. సరైన పాత్రలు చేయక క్రేజ్ మొత్తం కోల్పోయింది. ఐతే మళ్లీ ఆమె కెరీర్‌ను నిలబెట్టాల్సిన బాధ్యత అజయ్ భూపతి మీదే పడింది. అతను కూడా మధ్యలో ‘మహాసముద్రం’తో దెబ్బ తిని.. తిరిగి ‘మంగళవారం’తో పట్టాలెక్కాలని చూస్తున్నాడు. ఈ చిత్రంలో లీడ్ రోల్ చేసింది పాయలే అన్న సంగతి తెలిసిందే.
‘మంగళవారం’ ప్రోమోల్లో పాయిల్ రాజ్‌పుత్ పాత్ర నిగూఢంగా కనిపించింది.
తన అప్పీయరెన్స్ కూడా డిఫరెంట్‌గా అనిపించింది. ఇందులో పాయల్ పాత్ర గురించి ఆల్రెడీ టాలీవుడ్లో సెన్సేషనల్ టాక్ నడుస్తోంది. ఆమె ఒక మానసిక సమస్యతో బాధపడే పాత్రలో నటిస్తోందట. తన పాత్ర సైకో తరహాలో ఉంటుందట. యునీక్ క్యారెక్టరైజేషన్‌తో ఆ పాత్రను అజయ్ డిజైన్ చేశాడని సమాచారం. సినిమాలో ఆమెతో ముడిపడ్డ ప్రతి సన్నివేశం చాల ా ఆసక్తికరంగా ఉంటుందని.. తన పాత్ర కచ్చితంగా పేలుతుందని అంటున్నారు. ఈ పాత్ర క్లిక్ అవుతుందా లేదన్నదాన్ని బట్టే సినిమా ఫలితం కూడా ఆధారపడి ఉంటుందట.
ఆ పాత్ర ప్రేక్షకులను మెప్పిస్తే సినిమా హిట్టయినట్లే అంటున్నారు. పాయల్ కోసమే యూత్ థియేటర్లకు వస్తారని చెబుతున్నారు. ఈ నెల 17న ‘మంగళవారం’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.