ప్రముఖ నటి, యాంకర్ హరితేజ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని హరితేజ షేర్ చేసింది. ఏప్రిల్ 5న ఆడపిల్లకు జన్మనిచ్చిన విషయాన్ని ‘ఇట్స్ బేబీ గర్ల్’ అంటూ హరితేజ పోస్ట్ చేసింది. తన భర్తతో ఉన్న ఫోటోను ఇన్ స్టాలో పోస్ట్ చేసి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో, హరితేజకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
గత ఏడాది తన ప్రెగ్నెన్సీ గురించి కూడా సోషల్ మీడియా ద్వారానే తెలియజేసిన హరితేజ…తనకు పాప పుట్టిన విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారానే వెల్లడించడం విశేషం. తన ప్రెగ్నెన్సీ ఫోటో షూట్స్ తో అభిమానులకు టచ్ లోనే ఉన్న హరితేజ…మరి కొద్ది నెలల్లో షూటింగ్ లో పాల్గొనే అవకాశముంది. బుల్లితెరపై సీరియల్స్‌లో నటించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత పలు సినిమాల ద్వారా వెండితెరపైనా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. యాంకర్‌గా పాపులర్ అయిన హరితేజ….బిగ్‌బాస్ 1తో మరింత పాపులర్ అయింది. బిగ్ బాస్-1 విన్నర్ శివ బాలాజీకి గట్టిపోటీనిచ్చిన హరితేజ…రెండో స్థానతో సరిపెట్టుకుంది. అయినప్పటికీ హరితేజకు బిగ్ బాస్ ఫేంగా మంచి గుర్తింపు లభించింది. 2015లో ఆమె వివాహం జరిగింది.