రుషికొండ మీద ఉన్న రిసార్టును ఏపీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా మార్చేలా జగన్ సర్కారు నిర్ణయించటం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కావటం తెలిసిందే. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి రుషికొండ మీద ఏర్పాటు చేసిన బస.. ఆయనకు అత్యంత అనుకూలంగా ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తాజాగా హైకోర్టు కీలక తీర్పును జారీ చేసింది.
ముఖ్యమంత్రి నివాసానికి అత్యంత అనుకూలంగా ప్రభుత్వం నివేదిక ఇచ్చిన వేళలోనే హైకోర్టు ఏర్పాటు చేసిన నిపుణల కమిటీ.. రుషికొండపై ఉల్లంఘనలు చోటు చేసుకున్నట్లుగా నివేదిక ఇవ్వడం గమనార్హం. దీనికి సంబంధించిన ఏపీ హైకోర్టు కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సందర్భంలోనే ఏపీ సర్కారు.. ముఖ్యమంత్రి నివాసానికి రుషికొండ అత్యంత అనుకూలంగా పేర్కొంది.
ఇన్నాళ్లు రుషికొండపై కడుతున్న నిర్మాణాలు.. పర్యాటక భవనాలుగా పేర్కొనటం తెలిసిందే. అయితే.. అవన్నీ ముఖ్యమంత్రి నివాసం కోసమని విపక్షాలు విమర్శించాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ముఖ్యమంత్రి నివాసానికి ఈ భవనాలు అనుకూలంగా ఉంటాయని ప్రభుత్వం నివేదిక ఇవ్వటం ఒక ఎత్తు అయితే.. నిబంధనల్ని ఉల్లంఘించి మరీ భవన నిర్మాణాలు సాగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. పర్యావరణ చట్టం ప్రకారం ఏ మేరకు నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న విషయంపై పరిశీలాంచాలని కోరుతూ కేంద్ర పర్యావరణ.. అటవీ మంత్రిత్వ శాఖ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఒకేరోజు రెండు విరుద్ధమైన ఆదేశాలు రావటం చూసినప్పుడు ముహుర్తం బాగోలేదని.. ఈ అంశంపై పునరాలోచిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.