చంద్ర బాబు అరెస్ట్ అయి జైల్లో ఉంటే బాలకృష్ణ సినిమాలు ఎందుకు విడుదల చేస్తున్నారు? చంద్రబాబు కుటుంబం, టీడీపీ కేడర్ బాధలో ఉంటే, చంద్రబాబుపై ప్రేమ ఉంటే హెరిటేజ్‌ను ఎందుకు మూయలేదు? అటువంటి సందర్భంలో ప్రజలు మాత్రం రోడ్డుపైకి ఎందుకు రావాలి? ఎందుకు నిరసన తెలపాలి?…మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పుర్రెలో పుట్టిన అద్భుతమైన ప్రశ్నలివి.
అయితే, ఈ ప్రశ్నలకు కామన్ సెన్స్ ఉన్న ఏ కామన్ మ్యాన్ అయినా చెప్పే సమాధానమిదే. చంద్రబాబు అరెస్టుకు, బాలయ్య సినిమాల విడుదలకు సంబంధమే లేదు. హెరిటేజ్ మూసేయడానికి, చంద్రబాబు కస్టడీకి కాస్తంత కూడా కనెక్షన్ లేదు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జనం, టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్లమీదకు వచ్చి నిరసన తెలపడానికి..సినిమాల విడుదల, హెరిటేజ్ వ్యాపారానికి ఏ కోశాన సంబంధం లేదు.
కానీ, ఈ చిన్న విషయం..అమాత్యుడి హోదాలో ఉన్న కారుమూరికి అర్థం కాకపోవడం రాష్ట్ర దౌర్భాగ్యం అని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఇలా మతిలేని నేతలు మంత్రులుగా ఉండడం వల్లే పాలన అధోగతిపాలైందని ట్రోలింగ్ జరుగుతోంది. బాబు అరెస్టుకు బాలయ్య సినిమాకు లింకేంటి మంత్రిగారూ? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.