జగన్ సర్కారు కొందరిని టార్గెట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వారిలో ఒకరు ఏబీ వెంకటేశ్వరరావు. ఆయనపై అనేక ఆరోపణలు చేసి బజారుకీడ్చారు. చివరకు హైకోర్టు జగన్ సర్కారుకు చీవాట్లు పెట్టింది. అయినా వినకుండా సుప్రీంకోర్టుకు వెళ్లారు.
అక్కడ తాత్కాలికంగా ఏబీకి ఎదురుదెబ్బ తగిలినా… మంచి దారి దొరికిదింది. సుప్రీంకోర్టు ఏపీ సర్కారుతోనే విచారణ కమిటీ వేయించింది. సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీఎస్, మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై రాష్ట్రప్రభుత్వం వేసిన ఎంక్వైరీ కమిషన్ విచారణ ముగిసింది.
ఈ సందర్భంగా ఏబీ స్పందించారు. విచారణ కమిషనర్ సిసోడియా ముందు ఆయన తన వాదనను వినిపించారు. 14 రోజులుగా కొనసాగిన విచారణ పూర్తయిందని.. తాను కూడా సాక్ష్యం ఇచ్చానని ఏబీ తెలిపారు.
నాపై వచ్చిన అభియోగాలపై నేనే వాదించుకున్నానని.. ఆయన అన్నారు.
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి మరణం ప్రమాదవశాత్తూ జరిగింది అనడంలో ఎంత నిజముందో తనపై వచ్చిన ఆరోపణల్లోనూ అంతే నిజముందన్నారు. ఈ రెండు ప్రచారం చేసిన వ్యక్తులు ఒకరే అని ఏబీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన అదృష్టం బాగుండి సుప్రీంకోర్టు జోక్యంతో ఏడాదిన్నరలోనే నిజానిజాలు బయటకొచ్చే అవకాశం వచ్చిందుకు సంతోషం అన్నారు. ఐపీఎస్ అధికారిగా 30 ఏళ్లపాటు మచ్చ లేకుండా పనిచేసిన తనపై నిరాధారంగా, కుట్రపూరితంగా ఆరోపణలు చేశారని వాపోయారు ఏబీ.