వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఒక్కటే అన్నది పాత సామెత…కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉండే పార్టీలను ఈడీ, సీబీఐ టచ్ చేయలేవన్నది అప్డేటెడ్ సామెత. ఇదేదో ఫ్లోలో చెబుతున్న ముతక సామెత కాదు…గత కొద్ది నెలలుగా దేశంతోపాటు ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే బోధపడే తత్వం.
దేశంలో కొద్ది నెలలుగా పలు రాష్ట్రాలలో పలు కేసులలో ఈడీ, సీబీఐ సోదాలు జరిగినా..అందులో జగన్ రెడ్డి, కేసీఆర్ ఉండరన్నది జగనెరిగిన సత్యం. కవిత లిక్కర్ స్కాంలో పాపులర్ అయినా… బాబాయ్ హత్య కేసులో అన్ని వేళ్లూ జగన్ వైపే చూపిస్తున్నా ఎవ్వరూ కిమ్మనలేని పరిస్థితి.
ఇక, మిగతా పార్టీలకు చెందిన నేతలు..అందులోనూ బీజేపీకి యాంటీ పార్టీలకు చెందిన నేతలైతే ఈడీ, సీబీఐలు రెక్కలు కట్టుకొని వాలిపోతాయన్న విమర్శలున్నాయి. ఆ విమర్శలకు తగ్గట్లే సోదాలు కూడా జరిగాయి. సంజయ్ సింగ్- ఇండియా (ఆప్), కె పొన్ముడి – ఇండియా (డీఎంకే), సెంథిల్ బాలాజీ – ఇండియా (డీఎంకే), గిరీష్ దేవాంగన్ – ఇండియా (కాంగ్రెస్), సౌమ్య చౌరాసియా- ఇండియా (కాంగ్రెస్), మనీష్ సిసోడియా – ఇండియా (ఆప్), సంజయ్ రౌత్ – ఇండియా (ఎస్ఎస్పీ), తేజస్వి యాదవ్ – ఇండియా (ఆర్జేడీ), వినోద్ తివారీ – ఇండియా (కాంగ్రెస్), సుశీల్ సన్నీ – ఇండియా (కాంగ్రెస్), ఆర్పీ సింగ్ – ఇండియా (కాంగ్రెస్), దేవేంద్ర యాదవ్ – ఇండియా (కాంగ్రెస్), రాంగోపాల్ అగర్వాల్ – ఇండియా (కాంగ్రెస్)…ఈ జాబితాలో బీజేపే నాయకుడు, ఎన్డీఏకు చెందిన నాయకుడు, మోడీకి అనుకూలంగా ఉండే జగన్ వంటి నాయకుడు ఒక్కడు లేడు.