రాబోయే ఎన్నికల్లో ఓట్లు చేజారిపోకుండా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు నానా అవస్థలు పడుతున్నట్లున్నారు. అందుకే గతంలో మాట్లాడిన మాటలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు కేటీయార్. ఎన్టీఆర్ ను కేటీయార్ ప్రశంసలతో ముంచెత్తటం, చంద్రబాబు అరెస్టును హరీష్ ఖండించటం వెనుక కమ్మ సామాజికవర్గం నేతల అసంతృప్తే కారణమని తెలుస్తోంది.
కేటీయార్ వైఖరితో మెజారిటీ సీమాంధ్ర ఓట్లు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారే అవకాశముందని సీమాంధ్ర ఎఫెక్ట్ ఉన్న ఏరియాల ఎంఎల్ఏలు మొత్తుకున్నారట. ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 35 నియోజకవర్గాల్లో సీమాంధ్ర ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇపుడు పైగా జనసేన టీడీపీ ఒక్కటయ్యాయి. కాబట్టి… ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్ధులు గెలవాలంటే సీమాంధ్ర ఓటర్ల మద్దతు తప్పనిసరి. గెలుపోటములను నిర్ణయించగల బలమైన ఓటుబ్యాంకుకు వ్యతిరేకంగా కేటీయార్ మాట్లాడటం వల్ల నష్టం జరగటం ఖాయమని సీమాంధ్ర ఓటర్ల ప్రభావం ఉన్న ఎమ్మెల్యేలతో పాటు, కమ్మ ఎంఎల్ఏలు గోల చేశారట. అందుకనే అర్జంటుగా కేటీయార్ తో పాటు హరీష్ కూడా డ్యామేజి కంట్రోలుకు దిగినట్లు పార్టీవర్గాల సమాచారం.
ఇంతకీ విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ లో ఆందోళనలు జరిగాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల ఇబ్బందులు ఎదురై పోలీసులు లాఠీఛార్జి చేయాల్సొచ్చింది. ఇదే విషయమై మంత్రి కేటీయార్ మాట్లాడుతూ ఏపీలో అరెస్టుకు నిరసనగా తెలంగాణాలో ఆందోళనలు చేస్తామంటే కుదరదని స్పష్టంగా ప్రకటించారు. ఈ సబ్జెక్టును ఇగ్నోర్ చేసినా ఇబ్బంది ఉండేది కాదు… కానీ నిరసనలను అదేపనిగా వ్యతిరేకించడంతో బీఆర్ఎస్ కు భారీ డ్యామేజ్ జరిగింది. అందుకే ఇపుడు అవస్థలు పడుతున్నారు.
అయితే… కేటీఆర్ మేము జగన్ మనుషులం అని చెప్పకనే చెప్పేశాడు. ఇపుడు ఎంత డ్యామేజ్ కంట్రోల్ చేసిన ప్రయోజనం కనపడటం లేదు.