స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం సంచలనం రేపింది. ఈ ప్రకారం ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. సర్వీస్ నిబంధనలను అతిక్రమించారన్న కారణంతో పెండ్యాలను సస్పెండ్ చేశామని చెప్పారు. ఆ కేసులో పెండ్యాల శ్రీనివాస్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పెండ్యాలపై వేటు పడిందని తెలుస్తోంది. శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు డబ్బులు అందాయని సీఐడీ ఆరోపించిన సంగతి తెలిసిందే.
కొద్ది రోజుల క్రితం చంద్రబాబుకు ఐటీ నోటీసుల వచ్చిన వ్యవహారంలోనూ పెండ్యాల పేరు వినిపిస్తోంది. ప్లానింగ్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న పెండ్యాల శ్రీనివాస్ కొద్ది రోజుల క్రితం అమెరికా వెళ్లారు. అయితే, ఉన్నతాధికారులకు చెప్పకుండా, అనుమతి లేకుండా అమెరికా వెళ్లారని తెలుస్తోంది. దీంతో, పెండ్యాల శ్రీనివాస్ కు ప్లానింగ్ డిపార్ట్ మెంట్ మెమో జారీ చేసి, అమెరికా టూర్ పై వారం రోజుల్లోపు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. వారం రోజుల గడువు ముగిసినా పెండ్యాల శ్రీనివాస్ రాకపోవడంతో ఆయనను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.