స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందస్తు బెయిల్ కోరుతూ లోకేష్ తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే లోకేష్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 4వ తేదీ వరకు అరెస్టు చేయవద్దంటూ ఆ పిటిషన్ తదుపరి విచారణను అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.
ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను అక్టోబర్ 4వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఒక బూటకమని, 2001 లోనే ఈడుపుగల్లులో తనకు 40 సెంట్లు భూమి ఉందని, ఆ భూమి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో కోల్పోయానని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నష్టపోయిన తనపైనే రివర్స్ లో కేసులు పెడుతున్నారని, తమకు కోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు.