స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి 42 కేంద్రాలకు సామాగ్రి సరఫరా జరిగింది.
సీమెన్స్ కంపెనీ అద్భుత పనితీరు కనబరిచిందని నివేదికలు వచ్చాయి.
ఆ 42 కేంద్రాల్లోని ఎక్విప్మెంట్ ను చూపిస్తూ మీడియాకు వీడియోలు విడుదల చేసారు టీడీపీ నేత పయ్యావుల కేశవ్.
కుట్రపూరితంగానే శరత్ అసోసియేషన్తో తప్పుడు నివేదికలు తెప్పించుకుని చంద్రబాబు గారిపై అక్రమ కేసులు పెట్టారని పయ్యావుల కేశవ్ అన్నారు.
అందుకే ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందని దాన్ని కప్పి పుచ్చుకోడానికి ఫైబర్ గ్రిడ్ స్కామ్ అంటూ కొత్త నాటకం మొదలు పెట్టిందని అన్నారు.