సెప్టెంబరు 9/10, 2023 తేదీలలో ఉదయం 10 గం. నించి సాయంత్రం 5 గం. వరకు వీక్షణం 11 వ వార్షికోత్సవాన్ని అంతర్జాలంలోనూ, అమెరికాలోని కాలిఫోర్నియాలో మిల్పిటాస్ నగరంలోని స్వాగత్ హోటల్లోనూ అట్టహాసంగా జరుపుకుంది.
ఈ కార్యక్రమాలను వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ రచయిత్రి డా.కె.గీతామాధవి సభకు ఆహ్వానం పలికి ప్రారంభించారు.
ముందుగా అంతర్జాల కార్యక్రమంలో శ్రీ మృత్యుంజయుడు తాటిపాముల, శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ ఆత్మీయవాక్యాలు పలికారు.
విశిష్ట అతిథిగా వంగూరి ఫౌండేషన్ అధినేత శ్రీ వంగూరి చిట్టెన్ రాజు విచ్చేసి, ప్రసంగించారు.
ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ రేవూరి అనంత పద్మనాభరావు “తెలుగుసాహిత్య సౌరభం” అనే అంశం మీద, ప్రొ.కొలకలూరి మధుజ్యోతి “ఆధునిక తెలుగు సాహిత్యంలో స్త్రీ చిత్రణ” అనే అంశం మీద వివరణాత్మక ప్రసంగాలు చేసారు.
ప్రత్యేక అతిథులుగా యు.కె నించి శ్రీ రాజేష్ తోలేటి, ఫ్రాన్స్ శ్రీ వెంకట కృష్ణ మాదాసు పాల్గొని తమ సందేశాలనందించారు.
డా.సంధ్యారాణి కొండబత్తిని కవిసమ్మేళనాన్ని నిర్వహించారు.
ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, ఫ్రాన్సు దేశాల నుండి కవులు పాల్గొన్న ఈ అంతర్జాతీయ కవి సమ్మేళనంలో వసీరా, డా.కె.గీత, శ్రీధర్ రెడ్డి బిల్లా, ఉషా శ్రీదేవి శ్రీధర, పిళ్ళా వెంకట రమణమూర్తి, ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, సాదనాల వెంకటస్వామి నాయుడు, డాక్టర్ కందేపి రాణిప్రసాద్, దేవి గాయత్రి, డాక్టర్ ఎం.ఎన్.బృంద, మేడిశెట్టి యోగేశ్వరరావు, అమృతవల్లి అవధానం, మామిళ్ల లోకనాధం, నారోజు వెంకటరమణ, డాక్టర్ మోటూరి నారాయణరావు, ప్రసాదరావు రామాయణం, డాక్టర్ దేవులపల్లి పద్మజ, కె.వి.యస్. గౌరీపతి శాస్త్రి, గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, డబ్బీరు వెంకట రమణమూర్తి, మన్నె లలిత మొ.న వారు పాల్గొని కవితాగానం చేసారు.
ఇక కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో స్వాగత్ హోటల్లో రోజంతా జరిగిన వీక్షణం వార్షికోత్సవాన్ని డా.కె.గీత నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా శ్రీ మధు బుడమగుంట, శ్రీ చిమటా శ్రీనివాస్, శ్రీ కిరణ్ ప్రభ ప్రసంగాలు చేశారు.
శ్రీ వేణు ఆసూరి కవితాసంపుటి “తరంగాలు” పుస్తకావిష్కరణని శ్రీ సుభాష్ పెద్దు నిర్వహించారు.
శ్రీ ఎ.కె. ప్రభాకర్ నిర్వహించిన కథా చర్చలో శ్రీ కె.వి. రమణారావు, శ్రీమతి తురగా జయశ్యామల, డా.కె.గీత, కుమారి అమూల్య, శ్రీ విద్యార్థి మొ.న వారు పాల్గొన్నారు.
శ్రీ వంశీ ప్రఖ్యా నిర్వహణలో జరిగిన కవిసమ్మేళనంలో స్థానిక ప్రముఖ కవులు శ్రీమతి షంషాద్, శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్, డా.కె.గీత, శ్రీ ఎ.కె. ప్రభాకర్, శ్రీ వేణు ఆసూరి మున్నగువారు పాల్గొన్నారు.
ఈ సభల్లో వీక్షణం 11 వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికల ఆవిష్కరణలు శ్రీ కిరణ్ ప్రభ, శ్రీమతి కాంతి పాతూరి, డా.కె.గీత చేతుల మీదుగా జరిగాయి.
ఎందరో సాహిత్యాభిలాషులు విశేషంగా పాల్గొన్న ఈ వార్షికోత్సవ సందర్భంగా అధ్యక్షులు డా.కె.గీతామాధవి కవులకు, అతిథులకు ప్రశంసాపత్రాల్ని అందజేశారు.
కిందటి ఏడాది నించి ప్రపంచ వ్యాప్తమైన “వీక్షణం” సాహితీ గవాక్షం అమెరికాలోని కాలిఫోర్నియా, బే ఏరియా లోనే కాక, నెలనెలా అంతర్జాతీయ అంతర్జాల సాహిత్య కార్యక్రమాలు జరుపుకుంటూ ప్రవాసాంధ్రుల తెలుగు భాషాభిమానాన్ని, సాహిత్యాభిలాషని ప్రపంచమంతా చాటుతున్నది.