టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనతో ములాఖత్ కు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి ఈ రోజు వెళ్లారు. సాయంత్రం 4 గంటల సమయంలో చంద్రబాబును వారు కలిశారు. దాదాపు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో వారు మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన భువనేశ్వరి ఎమోషనల్ అయ్యారు.
తనలో ఒక భాగం జైలులో వదిలినట్లు అనిపిస్తోందని భువనేశ్వరి చెమర్చిన కళ్లతో మాట్లాడారు. తన కుటుంబం కన్నా ప్రజల గురించి నిత్యం పరితపించే ఆయనను ఇలా జైల్లో చూడడం కలచివేసిందని మనోవేదనకు గురయ్యారు. అన్యాయంగా తప్పుడు కేసులో ఇరికించి జైల్లో పెట్టారని ఆరోపణలు గుప్పించారు. జైల్లో నుంచి కూడా ప్రజల గురించే ఆలోచిస్తున్నారని, ఏపీని నంబర్ వన్ గా నిలబెట్టేందుకు తన జీవితాన్ని ఆయన ధారపోశారని భావోద్వేగంతో మాట్లాడారు. తన ఆరోగ్యం బానే ఉందని, తాను బాగున్నానని, తన గురించి కంగారు వద్దని ఆయన అన్నారని భువనేశ్వరి చెప్పారు.
చంద్రబాబు భద్రత గురించే తన చింత అని, జైల్లో సౌకర్యాలు సరిగా ఉన్నట్లు కనిపించడం లేదని అన్నారు. చన్నీటితో స్నానం చేయాల్సి వస్తోందని సదుపాయాల గురించి మాట్లాడారు. ఈ కష్ట సమయంలో తమ కుటుంబానికి, పార్టీకి ప్రజలంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. వాస్తవానికి భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణిలతోపాటు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని, ఆమె భర్త భరత్ వచ్చినప్పటికీ అనుమతి లేక జైలు బయట ఉండాల్సి వచ్చింది. రేపు, హైకోర్టులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు రావాలని టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నాయి.
ఆయన్ను చూసి వచ్చాక ఒక భాగం వదిలేసి వచ్చినట్టుంది. చంద్రబాబు గారి భద్రతపై నాకు భయంగా ఉంది – నారా భువనేశ్వరి గారు #IAmWithBabu #WeWillGiveItBack#PsychoJagan #CBNWillBeBackWithABang #PeopleWithNaidu pic.twitter.com/nBHZzZHvWU
— Telugu Desam Party (@JaiTDP) September 12, 2023
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు గారిని కలిసి బయటకు వచ్చిన భువనేశ్వరి గారు మీడియాతో మాట్లాడుతూ… "తనలో ఒక భాగాన్ని లోపల వదిలేసి వచ్చినట్టుంది" అంటూ ఆవేదనతో అన్న మాట విన్నవారి మనసుల్ని కదిలించేస్తోంది
#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu pic.twitter.com/SWSjHUuG0n— Telugu Desam Party (@JaiTDP) September 12, 2023
రాజమహేంద్రవరం చేరుకున్న నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, భరత్ గార్లు. సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు గారిని కలవనున్న కుటుంబసభ్యులు.#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang pic.twitter.com/SSjzl2X0tf
— Telugu Desam Party (@JaiTDP) September 12, 2023