ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు తెలుగు రాష్ట్రాలలో సంచలన పరిణామంగా మారిన సంగతి తెలిసిందే. టిడిపి రథసారథి జైలుకు వెళ్లడంతో సహజంగానే ఈ విషయంలో టిడిపి నేతలు తమ ఆరోపణలకు మొదలు పెడుతున్నారు. పలు ప్రతిపక్ష పార్టీలు సైతం టీడీపీకి మద్దతు అందిస్తున్నాయి. అయితే తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ ఉంటుందంటు జరుగుతున్న ప్రచారం సమయంలో జగన్ పై ఓ సెటైర్ సోషల్ మీడియాలో ప్రస్తావనకు వస్తోంది.
రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబునాయుడును అరెస్టు చేయించడం జగన్మోహన్ రెడ్డి తీర్చుకున్న ప్రతీకారంగా విశ్లేషకులు భావిస్తుండగా… ఈ విషయంలో కేంద్ర అండదండలు ఉంటాయి ఉండి ఉంటాయనే అనుమానాలు తెలుగుదేశం అనుకూల వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరోవైపు లండన్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ మంగళవారం ఉదయం రాష్ట్రానికి చేరుకున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే ఆయన ఢిల్లీ పర్యటన ఉంటుందన్న ప్రచారం వెనుక అసలు కారణం చంద్రబాబు అరెస్టు సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లేందునని అంటున్నారు.
ఈ సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసు పరిణామాలను పలువురు ప్రస్తావిస్తున్నారు. ఓటుకునోటు కేసు సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు `మనవాళ్లు బ్రీఫ్డ్ మీ` అనే మాట ద్వారా పాటు కేసులో ప్రస్తావనకు రాగా ఇప్పుడు జగన్ ఢిల్లీ వెళ్ళేది ప్రధానికి అదే డైలాగ్ చెప్పడానికి అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రధానితో సమావేశం సమయంలో, చంద్రబాబు అరెస్టుకు దారి తీసిన అవకతవకలు, రాజకీయపరమైన అంశాలు, అరెస్టు సందర్భంగా తాను లేకపోవడం వల్ల వివిధ పరిణామాలని తన సన్నిహితులు తెలియజేసిన విషయాన్ని పేర్కొంటూ జగన్ పేర్కొంటూ, `మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ` అని మోడీకి చెప్తారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు చంద్రబాబు అరెస్టు వివరాలు ప్రధానికి బ్రీఫ్ చేసేందుకే జగన్ ఢిల్లీ వెళుతున్నారని ఇదే బాబు అరెస్ట్ లో కీలక పరిణామం మన కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా, జీ20 విజయవంతం చేసినందుకు ప్రధానికి అభినందననలు తెలిపేందుకే వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్తున్నారని మరికొందరు పేర్కొంటున్నారు.