టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమండ్రిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నారా లోకేష్ …చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ పై లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాముకు తలలో విషం ఉంటే జగన్ కి ఒళ్లంతా విషం ఉందని, తన తండ్రి చంద్రబాబును అరెస్ట్ చేయించిన జగన్ సైకోలా ఆనందం పొందుతున్నాడని షాకింగ్ కామెంట్ చేశారు. అయితే, చంద్రబాబును అరెస్ట్ చేయించి జగన్ పెద్ద తప్పు చేసినట్లేనని భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు.
జగన్ పై 37 కేసులున్నాయని, ఆ విషయం ప్రజల ముందుకు బహిరంగంగా వచ్చి చెప్పే ధైర్యం జగన్ కు లేదని ఎద్దేవా చేశారు. పదేళ్లుగా ఆ కేసులకు సంబంధించిన ట్రయల్ కూడా సరిగా జరగడం లేదని అన్నారు. 2021 లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేదని, ఈరోజు హడావిడిగా పేరు చంద్రబాబుది పెట్టి ఆయనను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు వచ్చిన సీబీఐ అధికారులను వైసిపి కార్యకర్తలు అడ్డుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబుపై పెట్టింది ఒక ఫేక్ కేసు అని, షెల్ కంపెనీల గురించి వివరాలు రిమాండ్ రిపోర్ట్ లో చూపించలేదని లోకేష్ ఆరోపించారు.
చంద్రబాబుపై కేసు పెట్టి జగన్, మంత్రి రోజా వంటి వారు సంబరాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చంద్రబాబుపై ఏ రకంగా కక్ష్య సాధిస్తున్నారో అర్థమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, టీడీపీ ఈరోజు చేపట్టిన బంద్ కు జనసేన, సిపిఐ, సిపిఎం సంపూర్ణ మద్దతు ప్రకటించాయని, ఆ పార్టీలకు లోకేష్ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. తాను ఒంటరి వాడిని కాదని, జనసేన అధినేత, తన అన్న లాంటి పవన్ కళ్యాణ్ తనకు అండగా ఉన్నారని,పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమకు సంఘీభావం ప్రకటించారని, ఇంకా టీడీపీ నేతలు, కార్యకర్తలు అందరూ తమకు, తమ కుటుంబానికి అండగా నిలిచారని, వారందరికీ కృతజ్ఞతలు అని అన్నారు.
సైకో…! చంద్రబాబు గారి జోలికి వచ్చావు. దానికి రాజకీయంగా, వ్యక్తిగతంగా మూల్యం చెల్లించక తప్పదు – నారా లోకేష్#PeopleWithNaidu #FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang pic.twitter.com/SfS9KGya20
— Telugu Desam Party (@JaiTDP) September 11, 2023
బంద్ కు సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ గారికి, కమ్యూనిస్టు పార్టీ నాయకులకు, మందకృష్ణ మాదిగ గారికి, ఇతర పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు#APBandhForCBN#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang pic.twitter.com/TG9GOzLC9q
— Telugu Desam Party (@JaiTDP) September 11, 2023