ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే, చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేసి విచారణ జరిపేలా అనుమతినివ్వాలని ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు కోర్టుకు వచ్చిన లూథ్రా కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
రాజమండ్రి జైల్లో చంద్రబాబును ఉంచడం ప్రమాదకరమని, ఆయనకు ప్రాణహాని ఉందని లూథ్రా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్ పై వాదనలు వినిపిస్తామని, వెస్ట్ బెంగాల్‌కు చెందిన మంత్రుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును వాదనల సందర్భంగా ప్రస్తావిస్తామని లూథ్రా చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని, అక్కడ బెయిల్ రాకుంటే వెంటనే ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామని లూథ్రా అన్నట్లు తెలుస్తోంది.