ఎన్ఆర్ఐ టిడిపి ఆధ్వర్యంలోని ఎంపవర్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ పొందిన ఇరువురు ఉపాధ్యాయులకు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓక్లాండ్ లో ఉద్యోగ అవకాశం లభించింది.
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన హన్మంతరెడ్డి వెంకట భార్గవి, పాత్రపల్లి రాజకుమార్ (వైజాగ్)లు టీచింగ్ డిపార్ట్మెంట్ లో పని చేసే అవకాశం లభించింది.
వీరివురు టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ ద్వారా ఉద్యోగ అవకాశం పొందడంతో పాటు అందుకు అవసరమైన శిక్షణను కూడా ఉచితంగా పొందారు.
శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ మహ్మద్ అహ్మద్ గురువారం నాడిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో వీరువురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలో ఉద్యోగాలు పొందిన వారు మరింతమందికి ప్రేరణ కలిగిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఎన్ఆర్ఐ టిడిపి చీఫ్ డాక్టర్ వేమూరు రవికుమార్, ఎమ్మెల్సీ పి అశోక్ బాబు, టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ ట్రైనింగ్ కో ఆర్డినేటర్ పెండ్యాల యామిని, హెఆర్ విభాగం వి హిమజ తదితరులు పాల్గొన్నారు.