గతంలో ‘తానా’ ఫౌండేషన్ ట్రస్టీగా మిగిలిన రెండేళ్ల పదవీ కాలాన్నితాను అభిమానించే ప్రియమైన నాయకుడు జయరాం కోమటి సలహా తో, ‘తానా’ శ్రేయస్సు కొరకు త్యాగం చేసిన విషయం తెలిసిందే.
ఈ సారి ‘తానా’ ఎన్నికల ప్రక్రియను అర్దాంతరంగా రద్దు చేసి, మూడు వర్గాలు పదవుల్ని పంచుకొనే ప్రక్రియలో, తిరిగి గతంలో పనిచేసిన ఫౌండేషన్ ట్రస్టీ పదవికి ఎంపికైన సందర్భాన్ని పురస్కరించుకొని, తనకు ఎల్లవేళలా తన శ్రేయస్సు కోరుకునే తన మిత్ర బృందానికి, శ్రేయోభిలాషులకు బే ఏరియాలో ‘భక్తా బల్లా’ భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించారు.
‘భక్తా బల్లా’ ఎంపికపై ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు.
వారంతా ఈ కార్యక్రమానికి వచ్చి ‘భక్తా బల్లా’ మంచి మనసు గురించి గొప్పగా చెబుతూ ప్రశంసలు కురిపించారు.
ముఖ్యంగా ‘భక్తా బల్లా’ వ్యక్తిత్వం గురించి, ఆయన దయాగుణం గురించి ఆయన మిత్రులు ఎన్నో ఉదాహరణలు చెప్పారు.
త్వరలో ‘తానా’ అధ్యక్ష స్థాయికి కూడా చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు చెందిన ‘భక్తా బల్లా’ తన మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల సహాయ సహకారాలతో అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.
తన సహాయం కోరి వచ్చిన వారికి ఎల్లవేళలా ‘భక్తా బల్లా’ అందుబాటులో ఉంటూ తోచిన సాయం చేసేవారు.
తన మిత్రులు, శ్రేయోభిలాషుల సహాయసహకారాలు, ప్రేమాప్యాయలతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని ‘భక్తా బల్లా’ అన్నారు.
‘Your Voice Is My Voice’ అనే క్రొత్త నినాదంతో ముందుకు సాగుతానని ప్రకటించారు.
ప్రత్యేకించి జయరాం కోమటి తనకు అందించిన మద్దతు వెలకట్టలేనిదని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
తన ఎంపిక సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పార్టీ కి సహాయ సహకారాలు అందచేసిన మిత్రుడు వెంకట్ జెట్టి కి కృతజ్ఞతలు చెప్పారు.