సీఎం జగన్ బెయిల్ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో ఓ పోరాటమే చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు మొదలు సుప్రీం కోర్టు వరకు జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ చేసిన యుద్ధంలో చివరకు జగన్ గెలిచారు. ఆయన బెయిల్ పై ఉంటూనే ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ కు కాలం, ఖర్మం కలిసి వస్తే…ఏపీ ప్రజల ఖర్మ కాలితే మరోసారి కూడా సీఎం అయినా ఆశ్చర్యపోనవరసరం లేదు. ఇలా జగన్ బెయిల్ పై ఉంటూనే ఒక రికార్డు బద్దలు కొట్టిన సంగతి మీకు తెలుసా? స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అత్యధిక రోజులు బెయిల్ పై ఉన్న నిందితుడు జగన్ అంటే మీరు ఆశ్చర్యపోకుండా ఉండలేరు.
ఈ ఆశ్చర్యకరమైన సమాచారాన్ని తాజాగా బట్టబయలు చేసిన ఘనత సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణకు దక్కుతుంది. మోడీ దత్తపుత్రుడు జగన్ స్వాతంత్ర్యానంతరం ఏ నిందితుడికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నారని నారాయణ ఎద్దేవా చేశారు. బెయిల్పై బయట జగన్ ఉన్నన్ని ఏళ్లు మరే వ్యక్తీ ఉండలేదని, ఎన్నో కేసుల్లో నిందితుడైన జగన్ బెయిల్ పై ఉంటూనే ముఖ్యమంత్రి అయ్యాడని చురకలంటించారు. ఆంధ్రాలో వైసీపీ-బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్-బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు నడుస్తున్నాయని అన్నారు.
అవినాష్ రెడ్డిని వివేకా కేసు నుంచి బయటపడేసేందుకు కేంద్రానికి జగన్ మోకరిల్లాడని, తన కూతురు కవితను లిక్కర్ స్కామ్ నుంచి రక్షించేందుకు బీజేపీ తొత్తుగా కేసీఆర్ మారారని ఆరోపించారు. బీజేపీకి మిత్రుడిగా ఉన్న పవన్ ఎన్నికలనాటికీ మిత్రుడిగానే ఉంటాడో లేదో తెలీదని జోస్యం చెప్పారు. ఏది ఏమైనా జగన్ జైలు బెయిలు గురించి తాాగా నారాయణ చెప్పిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.