నియోజకవర్గంలో అధికారం.. ప్రజల్లో గౌరవం.. జనాలకు ఏ పని కావాలన్నా వచ్చి చేతులు కట్టుకుని నిలబడటం.. ప్రభుత్వ వాహనాలు.. అధికారిక లాంఛనాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఓ ఎమ్మెల్యే జీవితమే వేరు. పదవితో పాటు పలుకుబడి, డబ్బు.. ఇలా అన్ని రకాలుగా ఎమ్మెల్యేకు దక్కే మర్యాద, సౌకర్యాలు వేరు. కానీ ఉన్నట్లుండి ఇవన్నీ ఒక్కసారిగా పదవి తో పాటు దూరమైతే అప్పుడు పరిస్థితి ఏమిటీ? తలుచుకుంటేనే కళ్ల నుంచి నీళ్లు వస్తాయి. ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒక్కసారిగా చేతిలో నుంచి ఎమ్మెల్యే పదవి పోతుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ తరపున వచ్చే ఎన్నికల్లో నిలబడితే కచ్చితంగా గెలవొచ్చనే అంచనాలున్నాయి. ఆ ఆశతోనే ఇన్ని రోజులు ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ కరుణ దక్కకపోవడంతో లబోదిబోమంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పదవి లేకపోతే సాధారణ నాయకుడిలా మిగిలి పోవాల్సి వస్తుందనే భయంతో వణికిపోతున్నారని టాక్. అందుకే సీటు ఇవ్వకపోవడంతో ఏడుపు అందుకున్నా
ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు కేసీఆర్ టికెట్ ఇవ్వని సంగతి తెలిసిందే. దీంతో ఆమె విలేకర్ల సమావేశం పెట్టి భావోద్వేగానికి గురయ్యారు. ఇక నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆయన్ని కాదని అక్కడ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కేసీఆర్ అవకాశం ఇచ్చారు. దీంతో అనుచరులతో కలిసి రాజయ్య భోరుమన్నారు. సాష్టంగ నమస్కారం చేసి మరీ రోదించారు. మరోవైపు జనగామ టికెట్ దక్కదనే అంచనాల నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రజలకు సేవ సంగతి పక్కనపెడితే సొంత ప్రయోజనాలకు దెబ్బ పడుతుందనే ఈ నాయకులు కన్నీళ్లు పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈసారి టికెట్ రాకపోవడం తో కన్నీళ్లు పెట్టుకున్న BRS ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య…#TDPWillBeBack #TDPTwitter#TDPAndrapradesh #TDPtelangana pic.twitter.com/vD2fwkxdPG
— ???? (@TEAM_CBN1) August 22, 2023