గుజరాత్ లో 2002లో అల్లర్లు జరిగిన తర్వాత మొదటగా స్పందించిన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎన్డియే కన్వినర్ గా ఉన్న చంద్రబాబు బిజెపి/వాజపాయి లపై మోడిని ముఖ్యమంత్రి స్థానం నుంచి తొలగించాలని ఒత్తిడి తీసుకు రావడం జరిగింది.
దాని తర్వాత లోక్ జనశక్తి పార్టీ అధినేత వాజపాయి మంత్రి వర్గం నుంచి వైదొలగడం జరిగింది. చంద్రబాబు కొన్నాళ్ళ పాటు వాజపాయితో ఫోన్లో కూడా అందుబాటులో లేడు.
కొంతమంది బిజెపి/ఆర్ఎస్ఎస్ నాయకులు చంద్రబాబును కలిసే ప్రయత్నం చేసినా విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇది ఇలా ఉండగా అద్వాని మాత్రం తన శిష్యుని పదవి నుంచి తొలగించడానికి సుముఖంగా లేడు.
ఈ మధ్యలో చంద్రబాబు మోడిని తొలగించాలని పట్టుబట్టడం పై బాల్ ఠాక్రే చంద్రబాబు గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యాలు చేశాడు.
అల్లర్లు కొంత మేరకు సద్దుమణిగిన అనంతరం ఏప్రిల్ మొదటి వారంలో వాజపాయి ప్రధానమంత్రిగా గుజరాత్ లో బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ముస్లింల కోసం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో
ఒక మహిళ మోడిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని వేడుకుంది, అలాగే మరో వ్యక్తి ముందుకు వచ్చి వాజపాయి వెనుక నిలబడి ఉన్న మోడిని చూపించి అడుగో హంతకుడు అడుగో హంతకుడు అనడంతో వాజపాయికు నోట మాట రాలేదు.
దాంతో వాజపాయి అటు మిత్ర పక్షాల ఒత్తిడి, ఇటు ప్రజల నుంచి వస్తున్న ఆక్రోశమే కాకుండా అంతర్జాతీయంగా మీడియాలో వస్తున్న కథనాలకు వివిధ దేశాల నుంచి వ్యక్తం అవుతున్న ప్రతిక్రియ చూసి, అహ్మదాబాద్ లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో ప్రియా సెహగల్ అనే జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పాలకులు రాజ ధర్మం పాటించాలని, వ్యక్తిని వ్యక్తిగా చూడాలి తప్పించి కులం మతం ఆధారంగా భేద భావంతో ఉండ కూడదని, తాను అదేవిధంగా పని చేస్తున్నానని అనడంతో పక్కన ఉన్న ముడుచుకుపోయిన ముఖంతో మోడి తాను కూడా అలాగే చేస్తున్న సాహెబ్ అనడంతో వాజపాయి నరేంద్ర భాయి అలాగే చేస్తున్నాడని నమ్ముతున్నానంటూ డిల్లీకి బయిలుదేరి వెళ్ళిన పిమ్మట, తాను తొందర్లోనే కాంభోడియా వెళ్ళాలి.
దాని కంటే ముందు మోడిని పదవి నుంచి తొలగించకుంటే తాను అక్కడ ముఖం చూయించుకోలేనని ఆలోచనలో ఉండగా అద్వానికి వాజపాయికి మాటలు లేవు.
ఇంతలో వాజపాయి సింగపూర్ వెళ్ళవలసి వస్తే వాజపాయి వెంట రక్షణ సలహదారుడైన బ్రిజేష్ మిశ్రాను కూడా వెంట తీసుకుని వెళ్ళమని అక్కడ నుంచి ఫోన్ లో అద్వానితో మాట్లాడమని అరుణ్ శౌరి సలహా ఇస్తాడు.
కానీ వాజపాయి మాత్రం అద్వానితో మాట్లాడలేదు.
ఇంతలో ఏప్రిల్ 12న గోవాలో బిజెపి ప్లీనరి. దానికి వాజపాయి, అద్వాని, జస్వంత్ సింగ్ ప్రత్యేక విమానంలో వెళ్ళాలి. అనుకోకుండా ముందు రోజు రాత్రి బ్రిజేష్ మిశ్రా అరుణ్ శౌరికి ఫోన్ చేసి మీరు కూడా వాజపాయి వెళుతున్న విమానంలో వెళ్ళండి.
వాళ్ళిద్దరూ కనీసం గోవా వెళ్ళే లోపు మాట్లాడుకునే విధంగా చూడమని సలహా ఇవ్వడంతో అరుణ్ శౌరి కూడా వారితో పాటు బయిలు దేరగా విమానంలో వాజపాయి అద్వాని ఎడ ముఖం పెడ ముఖంగా కూర్చుని పేపర్ చదువుతున్నట్లు నటించడం చూసిన అరుణ్ శౌరి వాజపాయి చేతిలోని పేపర్ లాక్కుని కనీసం ఇప్పుడైన మీరు ఇద్దరు మాట్లాడుకోకుంటే ఎలా అనడంతో వాజపాయి కనీసం మోడి తన రాజీనామా చేస్తున్నట్లు ముందుకు రావాలి కదా అంటాడు. సరే అద్వాని అని జస్వంత్ సింగ్ ను చూసి ముసిముసిగా నవ్వుతాడు. వాజపాయి, శౌరిలకు అర్థం కాదు.
ప్లీనరీ మొదలు అయిన తర్వాత మొదటి రోజు మోడి మాట్లాడటం లేకపోయినప్పటికీ స్టేజ్ మీద ఉన్న వాజపాయి, అద్వాని, బిజెపి అధ్యక్షుడు జాన కృష్ణమూర్తిల దగ్గరకు వచ్చి మోడి మాట్లాడి రాజీనామా పత్రం ఇస్తానంటున్నాడని ప్రమోద్ మహాజన్ అనడంతో వాజపాయి సంతోషంగా సరే అనడం మోడి రావడం నేను అల్లర్లను జాగ్రత్తగానే నియంత్రించాను అయినా పార్టీకి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు రాజీనామా చేస్తున్న అనడంతో కొంత మంది పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు వద్దని.
దాంతో ముఖ్య నాయకులు అంత ఒకవైపు వాజపాయి ఒకవైపు అయినట్లు అయింది.
హఠాత్పరిణామానికి వాజపాయి మిన్నకుండిపోయాడు.
అసలు జరిగింది ఏమిటంటే?
ప్లీనరీకి ముందు రోజే అద్వాని, వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లి, మహాజన్, జస్వంత్ లు కలసి ఏం చేయాలనే పథక రచన చేసి అరుణ్ జైట్లిని అహ్మదాబాద్ కు పంపించి రంగం సిద్ధం చేశారన్నమాట.
రెండవ రోజు చివరిలో మోడి రాజీనామాను ప్లీనరీలో తిరస్కరించినట్లు తీర్మానం.
మధ్యలో ఏం జరిగిందో తెలియదు కాని ఆరోజు సాయంత్రం వాజపాయి విలేకర్లతో గతంలో ఇస్లాం శాంతియుతంగా ఉండేది కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని అనడంతో చాల విమర్శలు వచ్చాయి కాని దాని గురించి ఎవరు పట్టించుకోలేదు.
కొన్ని రోజులు తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం మంత్రి విజయ్ గోయల్ హైదరాబాద్ వచ్చి చంద్రబాబును కలసి వెళ్ళిన తరువాత మే నెల రెండవ వారంలో చంద్రబాబు డిల్లీ వెళ్ళి నప్పుడు చంద్రబాబు వాజపాయి ను కలవడానికి ముందే అద్వాని చంద్రబాబును కలసి నా కోసం జరిగిందాన్ని మర్చిపొమ్మనట్లు సమాచారం.
అయితే చంద్రబాబు అద్వానిని ఉద్దేశించి భవిష్యత్తులో ఎక్కువగా మీరే బాధ పడతారని చెప్పి వాజపాయిను కలసి, విలేకర్లు అడిగిన ప్రశ్నలకు అంటిముట్టనట్లు సమాధానం ఇచ్చి, చివరకు బాలయోగి స్థానంలో శివసేన నుంచి మనోహర్ జోషికి మద్దతు ఇస్తారా, మిమ్మల్ని ఠాక్రే విమర్శించాడు కదా అని అడిగిన దానికి కూడా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని మాత్రమే సమాధానం ఇచ్చి హైదరాబాద్ తిరుగు పయనం.
2002లో ఎవరెవరు మోడి కోసం అంత చేశారో వాళ్ళందిరిని అవకాశం రాగానే పక్కన పెట్టేశాడు మోడి.
జస్వంత్ సింగ్ టిక్కెట్ అడిగితే తిట్టించాడు.
వెంకయ్యనాయుడుకు రాజకీయ సమాధి,
అద్వాని మీద రాళ్ళ వేయించాడు.
అరుణ్ జైట్లి అనారోగ్యంతో అనుకోండి,
ప్రమోద్ మహాజన్ ముందే చనిపోయాడు.
ఇప్పుడు చెప్పండి ఎవరు వెన్నుపోటు దారుడు?