‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరుతో టీడీపీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు పర్యటనకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు వెళ్లిన ప్రతి నియోజకవర్గంలోనూ వేలాదిమంది జనం ఆయన సభలు, రోడ్ షోలకు హాజరయ్యారు. చంద్రబాబు పర్యటనలకు వస్తున్న స్పందనన ఓర్వలేక వైసీపీ కార్యకర్తలు ఆయన పర్యటనలను అడ్డుకునేందుకు రాళ్లదాడులకు పాల్పడడం సంచలనం రేపింది.
అంతేకాదు, చంద్రబాబుపై, టిడిపి నేతలు, కార్యకర్తలపై దాడి చేసి వారిపైనే కేసులు పెట్టిన వైనం రాష్ట్రంలో సంచలనం రేపింది. అయితే, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని కేసులు పెట్టిన వెన్ను చూపకుండా చంద్రబాబు తన పర్యటనను దిగ్విజయంగా ముగించారు. ఈ పర్యటన విజయవంతం అయిన సందర్భంగా చంద్రబాబుపై నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. బెదిరింపులకు భయపడకుండా రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘చంద్రయాన్’ పర్యటన విజయవంతం అయింది అంటూ లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘‘బాబు రావాలి-రాష్ట్రం గెలవాలి’’ అంటూ చంద్రయాన్ పేరుతో ఆ టూర్ వీడియోను లోకేష్ షేర్ చేయగా అది ట్రెండ్ అవుతోంది. ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి గ్రాండ్ సక్సెస్’ అయిందని లోకేష్ ట్వీట్ చేశారు. మొత్తం 10 రోజులలో 3000 కిలోమీటర్లు మేర చంద్రబాబు పర్యటన సాగిందని లోకేష్ అన్నారు.
‘‘చంద్రయాన్!
సాగునీటి ప్రాజెక్టు ల విధ్వంసం పై యుద్ధభేరి గ్రాండ్ సక్సెస్
10 రోజులు….
15 ప్రాజెక్టులు…..
20 జిల్లాలు….
30 నియోజకవర్గాలు…
35 ప్రజెంటేషన్లు, రోడ్ షోలు, బహిరంగ సభలు
3000 కిలోమీటర్లు….
బెదిరింపులకు భయపడలేదు….
రాళ్ళదాడులను లెక్కలేయలేదు….
జలం కోసం…జనం కోసం..
సాగునీటి కోసం….రైతు బాగుకోసం…
నీళ్ల కోసం ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రుడు. నాయుడే ప్రజా నాయకుడు!
బాబు రావాలి…..రాష్ట్రం గెలవాలి’’
బాబు రావాలి….
రాష్ట్రం గెలవాలి!#YuddhaBheri#ProjectsKillWaterNill#JaganFailsIrrigation #TDPforDevelopment pic.twitter.com/fdY8q7xfzT
— Lokesh Nara (@naralokesh) August 10, 2023