టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరిలోన స్థానిక కోర్టుకు హాజరయ్యారు. ఉదయం 12 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఆయన సుదీర్ఘ సమయం కోర్టులోనే గడిపారు. తనపై వచ్చిన అసత్య ఆరోపణలపై నారా లోకేష్ న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం లోకేష్ మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు. లోకేశ్ మంగళగిరి కోర్టుకు రావడంతో టీడీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు తరలివచ్చారు.
ఏంటీ కారణం..?
టీడీపీ హయాంలో చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పనులకు సంబంధించి..ఆ సంస్థ మాజీ చైర్మన్ అజయ్ రెడ్డి నారా లోకేష్‌పై గతంలో ఆరోపణలు చేశారు. అక్రమాలకు పల్పడ్డారని కూడా వ్యాఖ్యానించారు. ఇక, వైసీపీ అధికార పత్రికలోనూ నారాలోకేష్‌పై కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో వాటిపై ఇప్పటికే న్యాయవాది ద్వారా లోకేష్ నోటీసులు పంపారు. నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడం తో లోకేష్ తరఫు న్యాయవాదులు మంగళగిరి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు.
ఈ క్రమంలో ఈ రెండు కేసుల వ్యవహారంలో తనపై చేసిన అసత్య ఆరోపణలపై లోకేష్ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. సుమారు గంట పాటు.. ఆయన తన వివరణకు న్యాయమూర్తికి తెలిపారు. ఈ వాంగ్మూలాన్ని న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు. జిఎస్టి ఎగవేసిన కంపెనీలకు నోటీసులు ఇస్తే స్కిల్ స్కాంపై ఈడి కొరడా అంటూ తనకు సంబంధం ఉందని తప్పుడు రాతలు రాశారని.. నారా లోకేష్ చెప్పినట్టు సమాచారం. అదేవిధంగా వైసీపీ నేతలు పోతుల సునీత, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి తనపై చేస్తున్న ఫేక్ ప్రాపగాం డాపై చర్యలు తీసుకోవాలని గతంలో నారా లోకేష్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.