తాజాగా ఆన్లైన్ ఛానెల్ ఒకటి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన తాడిపత్రి నియజక వర్గంలో సర్వే చేసింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిపిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డికి.. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య పచ్చ గడ్డి వేస్తే.. భగ్గుమనే పరిస్థితి ఉంది. పైగా… 35 సంవత్సరాలకు పైగా ఈ నియోజకవర్గంలో జేసీల కుటుంబం హవా చలాయించింది. మరో పార్టీ కానీ, మరో నాయకుడు కానీ.. ఇక్కడి ప్రజలకు అవసరం లేదన్నట్టుగా 2014 ఎన్నికల వరకు వరసుగా 35 ఏళ్లపాటు ఈ కుటుంబానికి పట్టం కట్టారు.
అలాంటి కీలకమైన నియోజకవర్గంలో గత 2019 ఎన్నికల్లో అనూహ్యంగా పెద్దారెడ్డి విజయం దక్కించుకున్నారు. నిజానికి ఆయన విజయం దక్కించుకున్నారనేకంటే.. కూడా ప్రజలు ఇక్కడ మార్పు కోరుకున్నారనేది స్థానిక రాజకీయ విశ్లేషకుల మాట. సో.. ఇంత కీలక నియోజకవర్గంలో ఇప్పుడు మళ్లీ అదే రాజకీయం.. నాయకుల మధ్య వైరం వంటివి .. కొనసాగుతున్నా యి. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? పెద్దారెడ్డికే ప్రజలు పట్టంకడతారా? లేక.. జేసీ కుటుంబాన్ని మరోసారి అక్కు న చేర్చుకుంటారా? అనే విషయం ఆసక్తిగా మారింది.
ఈ క్రమంలోనే తాజాగా రెండు మూడు సర్వేలు జరిగాయి. దీని ప్రకారం.. తాడిపత్రిలో ప్రజల మనసులో మాట వ్యక్త మైంది. వాస్తవానికి మెజారిటీ ప్రజలు.. జేసీ ప్రభాకర్‌రెడ్డికి వ్యతిరేకంగా చెప్పలేదు. అయితే.. గత ఎన్నికల్లో ఆయన తను కాకుండా.. ఆయన కుమారుడికి అవకాశం ఇవ్వడం.. వైసీపీ దూకుడుగా ఉండడంతో కొంత ఓట్ల పోలరైజేషన్ జరిగిందని చెప్పుకొచ్చారు. ఇది కాకుండా.. నిజానికి జేసీలపైనే వ్యతిరేకత ఉంటే.. స్థానిక ఎన్నికల్లో ఆయన ను గెలిపించి ఉండే అవకాశం లేదని.. కాబట్టిజేసీ కుటుంబానికి ఇప్పటికీ ఆదరణ ఉందని మెజారిటీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇక, మరోవైపు.. పెద్దారెడ్డి విషయాన్ని కూడా ఈ సర్వే ప్రస్తావించింది. ఈ సమయంలో ప్రజలు కొంత వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “ఏదో చేస్తారని అనుకున్నాం. కానీ.. ఆయన తన రాజకీయాలు చూసుకుంటున్నారు. చూసుకోనివ్వండి. ఇంకెన్నాళ్లు చూసుకుంటారు“ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించిన వారు చాలా మంది కనిపించారు. ఎక్కువ మంది అభివృద్ధిని, నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు.. భూములను కాపాడే వారు కావాలని కోరుతున్నారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే వారిసంఖ్య ఎక్కువగా ఉన్న తెలిసింది. దీంతో జేసీ వర్సెస్ పెద్దారెడ్డి విషయంలో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారనేది ఇతమిత్థంగా తెలుస్తున్న వాస్తవం.