వైసీీపీ పాలనపై ఏపీ బీజేపీ కొత్త చీఫ్ పురంధేశ్వరి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టిన తర్వాత పురంధేశ్వరి దూకుడు పెంచారు. ఏపీని జగన్ అప్పుల ఊబిలో పడేశారని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనమైందని విమర్శించారు. రాబోయేది బీజేపీ, జనసేన ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. ఈ క్రమంలోనే పురంధేశ్వరి వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే పురంధేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.
కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధ్యక్షురాలు ఫ్లెక్సీలతో హడావుడి చేస్తున్నారని, దానికి బదులు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని ఎద్దేవా చేశారు. రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ త్వరగా ఏర్పాటు చేయాలని పోరాడాలని హతవు పలికారు. ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పనిచేయడం ఎందుకని విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు మాయల ఫకీరు వంటివాడని,, ఆయన మాయలో పడి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయంగా నష్టపోయారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. పురందేశ్వరి గారూ… ఇప్పుడు మీరు కూడా అలా చేయవద్దు అని హితవు పలికారు. పురందేశ్వరి తండ్రి స్థాపించిన పార్టీని ఇప్పుడు మరిది నడుపుతున్నారని, వీళ్లేమో వేరే పార్టీని నడుపుతున్నారని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. మరిది స్క్రిప్టునే పురందేశ్వరి చదువుతున్నారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబా? అని ప్రశ్నించారు. పురందేశ్వరి టీడీపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుని మాట్లాడితే బాగుంటుందని చమత్కరించారు. మరి, వైసీపీ నేతల వ్యాఖ్యలపై పురంధేశ్వరి రియాక్షన్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.