దాదాపు మూడు నెలలుగా మణిపూర్ లో నెలకొన్న పరిస్థితులు అంతకంతకు దారుణంగా మారటం తెలిసిందే. మే మొదటి వారంలో ఇద్దరు గరిజన మహిళల్ని దిగంబరంగా ఊరేగించి.. గ్యాంగ్ రేప్ నకు పాల్పడిన ఉదంతో పాటు.. పలు అమానుష ఉదంతాలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో తీవ్రమైన భయాందోళనలో ఉన్న మొయితీ వర్గానికి చెందిన ప్రజలు మణిపూర్ ను వదిలేసి పక్క రాష్ట్రాల బాట పట్టటం ఎక్కువైంది.
రాష్ట్రాన్ని విడుస్తున్న మొయితీల్లో ఎక్కువమంది దగ్గర్లో ఉన్న మిజోరం రాష్ట్రానికి వలస వెళుతున్నారు. అయితే.. అక్కడ కూడా మిలిటెంట్ సంస్థల నుంచి వారికి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో వారు అసోంకు తరలిపోతున్నారు. తాజాగా 41 మందితో కూడిన వారు మణిపూర్ ను వదిలేసి.. మిజోరం వలస వచ్చారు. సొంత రాష్ట్రంలో పరిస్థితులు కుదుట పడే వరకు పక్కనున్న రాష్ట్రాల్లో తలదాచుకోవాలన్న భావన వారిలో ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
మిజోరంలో ఉన్న మొయితీలకు మిలిటెంట్ సంస్థల నుంచి బెదిరింపుల రావటంతో వారు అసోం బాట పడ్డారు.
వీరిలో ఎక్కువ మంది ఆదాయపరంగా మంచి స్థానంలో ఉన్న వారు.. కాలేజీ ప్రొఫెసర్లు.. ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. తమకు మిజోరంలో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని.. కాకుంటే అక్కడ ఉండి రిస్కు తీసుుకోవటం ఇష్టం లేకనే అసోంకు వచ్చేసినట్లుగా చెబుతున్నారు. మణిపూర్ నుంచి తమ రాష్ట్రానికి వస్తున్న మొయితీలు వదంతుల్ని నమ్మొద్దని మిజోరం ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. మరోవైపు అసోంకు చేరుకున్న మొయితీలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సురక్షితమైన బస ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న మాజీ మిలిటెంట్లు కుకీ అనుకూల వర్గానికి చెందిన వారిగా చెబుతున్నారు. మొత్తంగా మణిపూర్ లో టార్గెట్ అయిన మొయితీలు.. ఇప్పుడు పక్కనున్న రాష్ట్రాలకు వెళ్లిపోతున్న వైనం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా కుకీలకు చెందిన ఇద్దరు మహిళల బట్టలూడదీసి రోడ్లలో నడిపించటంతో అల్లర్లు మరోసారి భగ్గుమన్నాయి. కుకీ-మొయితీ తెగల మధ్య రిజర్వేషన్ల గొడవ మొదలైన విషయం తెలిసిందే. తమకు కూడా గిరిజన రిజర్వేషన్లు కల్పించాలని కుకీలు చేసిన డిమాండ్లే గొడవలకు ఆజ్యంపోసింది. కుకీల డిమాండ్లను మొయితీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హఠాత్తుగా ఇద్దరు కుకీ మహిళ బట్టలూడదీసి రోడ్డుపై నడిపించటంతో మళ్ళీ అల్లర్లు మొదలయ్యాయి. మొయితీల ఇళ్ళపై ఒక్కసారిగా దాడులు పెరిగిపోతున్నాయి.