ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఏ దేశంలో ఉన్నా సరే…భారతీయ వంటకాలను ఇష్టపడతారు. విదేశాల్లో పిజ్జా, బర్గర్ మొదలు పంచభక్ష పరమాణ్ణం వంటి ఫాస్ట్ ఫుడ్ లు, రకరకాల పాశ్చాత్య వంటకాలు ఉన్నప్పటికీ…దేశీ ఫుడ్ కు గిరాకీ ఎక్కువ. ముఖ్యంగా, దక్షిణాది ప్రజలకైతే అన్నం, బియ్యంతో ముడిపడిన వంటకాలు లేనిదే ముద్ద దిగదంటే అతిశయోక్తి కాదు. అయితే, తాజాగా బియ్యం సంబంధిత వంటకాలు అమితంగా ఇష్టపడే ఎన్నారైలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది.
దీంతో, అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నారైలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. బియ్యం కోసం సూపర్ మార్కెట్లు, రైస్ స్టోర్స్, ఇండియన్ స్టోర్స్ ముందు బారులు తీరారు. ఒక్కమాటలో చెప్పాలంటే పది కిలోల రైస్ బ్యాగ్ కోసం బాహుబలి రేంజ్ లో క్యూలో నిలబడి యుద్ధం చేయాల్సి వస్తోంది. ఇదే అదనుగా దుకాణదారులు బియ్యం ధరలను అమాంతం పెంచేశారు. కొన్ని స్టోర్స్ ముందు పెరిగిన ధరల బోర్డులు దర్శనమివ్వగా, మరికొన్ని స్టోర్ల ముందు నో స్టాక్ బోర్డులు కనిపించాయి. దీంతో, బియ్యం కోసం ఎన్నారైలు వేట మొదలుబెట్టారు. ఈ క్రమంలోనే బియ్యం కోసం ఎన్నారైలు క్యూ కట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బియ్యం ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం ఎప్పుడు ఎత్తేస్తుందో తెలియక అవసరానికి మించి కూడా కొందరు ఎన్నారైలు బియ్యం కొంటున్నారు. దీంతో, పరిమితంగా బియ్యం కొనాలన్న ఎన్నారైలకు నిరాశ తప్పడం లేదు. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల ఎన్నారైల మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు కూడా జరిగాయని తెలుస్తోంది. ఇక, సందట్లో సడేమియా అన్న రీతిలో ఇల్లు కొంటే 15 రైస్ బ్యాగ్స్ ఫ్రీ అంటూ కొన్ని బిల్డర్ కంపెనీలు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి.
నాన్-బాసుమతి రైస్‌పై మాత్రమే నిషేధం విధించిన కేంద్రం… దేశీయంగా సరఫరాను పెంచటానికి ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులు, వరి పండించే ఇతర దేశాల్లో ప్రతికూల వాతావరణం తదితర కారణాల వల్లే ఎగుమతులు పెరిగాయని కేంద్రం చెబుతోంది.
After Banning Rice Exports From India, Indians situation in USA to buy rice bags????
Those who are living in USA Immediately go to your nearby Indian Store and get some Rice Bags Before its too late????????#RiceBanInUSA pic.twitter.com/vAumv6fedv
— Prabhas Fans USA???????? (@VinayDHFprabhas) July 21, 2023