టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు లోకేష్. అయితే, ఈ పాదయాత్రపై జగన్ కు వెన్నుదన్నుగా ఉంటున్న ఐ ప్యాక్ టీం నిఘా పెట్టడం సంచలనం రేపింది. ఐ ప్యాక్ సభ్యుడు ఈ పాదయాత్రకు వచ్చి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం సంచలనం రేపుతోంది. ఐ ప్యాక్ సభ్యుడిని టీడీపీ క్యాడర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో వైసీపీ ఖంగు తింది.
యువగళం పాదయాత్ర అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఐ ప్యాక్ సభ్యులు బయటికి చేరవేస్తున్న వైనం గుట్టు రట్టయింది. లోకేష్ ను రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయన పాదయాత్రకు వస్తున్న మద్దతును ఓర్వలేక వైసీపీ దిగజారుడు పనులకు పాల్పడుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, కనిగిరిలో పాదయాత్రకు దెందులూరు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. 700 మంది నేతలు, కార్యకర్తలతో కలిసి వచ్చిన చింతమనేని క్యూలో నిలబడి లోకేశ్ తో సెల్ఫీ దిగారు.
చింతమనేనిని చూసి లోకేష్ ఆశ్చర్యపోయారు. అన్నా మీరెప్పుడు వచ్చారు అంటూ చింతమనేనిని లోకేష్ ఆత్మీయంగా పలకరించారు. మీ యాత్రకు సంఘీభావం తెలపడానికి వచ్చానని చింతమనేని చెప్పారు. లోకేష్ కు పుష్పగుచ్ఛం ఇచ్చిన చింతమనేని ఆయనకు అభినందనలు తెలిపారు. చింతమనేని వచ్చారు. ఈ రోజు రాత్రి కనిగిరి శివారు శంఖవరం విడిది కేంద్రంలో లోకేష్ బస చేయనున్న సంగతి తెలిసిందే.