అమెరికా లోని ఫిలడెల్ఫియా నగరంలో మెఱియట్ హోటల్ లో ఆదివారం యువగళం పాద యాత్ర 150 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా సిడి అవిష్కరణ జరిగింది.
ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు టి డి జనార్దన్ మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్ర కి అపూర్వ ఆదరణ, అన్నివర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు.
యువగళం 150 రోజులు పూర్తి చేసుకొన్న సందర్భం గా పాదయాత్ర ముఖ్య సన్నివేశాలతో కూడిన సిడి ని డల్లాస్ నగరానికి చెందిన ఎన్నారై తెలుగుదేశం నాయకుడు శ్రీనివాసరావు కొమ్మినేని రూపొందించారని తెలిపారు.
ఈ కార్యక్రమం లో కొమ్మినేని మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో లోకేష్ ప్రజల సమస్యలను తెలుసుకొంటున్నారని, తెలుగు దేశం పార్టీ అధికారం లోకి రాగానే ప్రజల సమస్యలు పరిష్కరించి రాష్ట్రాన్ని పేదరిక రహిత రాష్ట్రము గా తీర్చి దిద్దగల సామర్ధ్యం చంద్రబాబు కి ఉన్నాయన్నారు.
రాష్ట్రాభి వృద్ధి, భావితరాల భవిషత్ కొరకు చంద్రబాబు తిరిగి ముఖమంత్రి కావాలన్నారు. తెలుగుదేశం ప్రెవేశ పెట్టాలనుకుంటున్న పథకాలు మహాశక్తి, అన్నదాత, ఇంటింటికీ నీరు, బిసిలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్, విషత్తుకు గ్యారంటీ పధకాలు అద్భుతం గా ఉన్నాయన్నారు.
ఈకార్యక్రమం లో టి డి జనార్దన్, అశ్విన్ అట్లూరి, శ్రీనివాస్ కొమ్మినేని, మధు యార్లగడ్డ, వంశి పోతినేని తదితరులు పాల్గొన్నారు.