ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోంది. వేల కోట్ల రూపాయలు.. వడ్డీ ఎంతైనా ఫర్వాలేదు.. అంటూ అప్పులను కుప్పలుగా తెచ్చుకుం టోంది. అయితే.. ఇలా తెస్తున్న అప్పులకు లెక్కలు ఏవీ.. పోనీ బడ్జెట్లో చేసిన ప్రకటనల మేరకైనా వైసీపీ ప్రభుత్వం ఖర్చులు చేస్తోందా? అంటే అది కూడా లేదు. తాజాగా 2000 కోట్ల రూపాయలను ఏపీ సర్కారు అప్పుగా తీసుకురావడం.. ఒకరోజు కిందటే అసలు చెబుతున్న దానికి చేస్తున్న ఖర్చుకు సంబంధం లేదని.. బరోడా బ్యాంకు నివేదిక స్పష్టం చేయడంతో ప్రస్తుతం ఏపీలో వైసీపీ సర్కారు చేస్తున్న ఖర్చులు.. తెస్తున్న అప్పులపై చర్చసాగుతోంది.
ఏపీ సీఎం జగన్‌పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఒకవైపు ఎన్నికలు దూసుకు వస్తున్నాయి. మరోవైపు.. టార్గెట్ కూడా పెద్దదిగానే ఉంది. ఈ నేపథ్యంలో జగన్‌పైనా.. వైసీపీనాయకులపైనా ఒత్తిడి బాగానే ఉంద ని అంటున్నారు పరిశీలకులు. అయితే.. తాజాగా వెలుగు చూసిన ఒక రిపోర్టు.. వైసీపీని, ప్రభుత్వాన్ని కూడా తీవ్ర ఇరకాటంలోకి నెట్టేసిందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఏ ప్రభుత్వమైనా.. రాష్ట్ర అభ్యున్నతికి కృషి చేయాలి.
ఎన్ని పథకాలు ఇచ్చినా.. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా.. రాష్ట్రంలో పెట్టుబడులు.. ఉద్యో గాలు.. ఉపాధి.. రాష్ట్ర సంపద వంటివి స్పష్టంగా కనిపించాలి. అయితే.. ఈ విషయంలో సీఎం జగన్ స ర్కారు.. ఎక్కడో తేడా కొడుతోంది. ఇదే విషయాన్ని తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా తన విశ్లేషణలో పేర్కొంది. వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మూల ధన వ్యయానికి .. క్షేత్రస్థాయిలో చేస్తున్న ఖర్చుకు పొంతన లేకుండా పోయిందనేది బ్యాంకు వాదన.
2022-23 వార్షిక బడ్జెట్లో 26 వేల కోట్ల రూపాయల పైచిలుకు మొత్తాన్ని జగన్ ప్రభుత్వం మూల ధన వ్యయంగా ప్రకటించింది. దీనివల్ల ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు.. ఉపాధి కల్పనకు దోహద పడుతుంది. అయితే.. సర్కారు మాత్రం ఈ మొత్తంలో కేవలం 6 వేల కోట్ల పైచిలుకు మొత్తాన్నిమాత్రమే ఖర్చు చేసింది. దీనివల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు. అదేసమయంలో ఉపాధి రంగం ఎక్కడిగొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది.
ఇదే విషయాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా స్పష్టం చేసింది. అయితే.. మూల ధన వ్యయానికి సంబంధించిన సొమ్మును కూడా.. రాష్ట్ర సర్కారు.. ఉచిత పథకాలకు అమలు చేస్తోందన్నది బ్యాంకు ఆరోపణ. దేశంలో పంజాబ్ ఏపీ రాష్ట్రాలే ప్రజలకు మితిమీరిన ఉచిత పథకాలు అమలు చేస్తున్నాయని.. విశ్లేషణలో బ్యాంకు స్పష్టం చేసింది. ఇది వైసీపీ ప్రభుత్వానికి ఇరకాటమేనని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు తాజాగా 2000 కోట్లు అప్పుగా తెచ్చింది. మరి దీనికైనా లెక్కలు చెబుతుందో లేదో చూడాలని అంటున్నారు.