మహిళల వస్త్ర ధారణ విషయంలో నిన్న మొన్నటి వరకు కర్ణాటక, యూపీ, బిహార్ వంటి రాష్ట్రాలకే పరిమి తమైన వివాదాలు ఇప్పుడు హైదరాబాద్కు కూడా చుట్టుకున్నాయి. తాజాగా హైదరాబాద్ సంతోష్న గర్లోని కేవీ రంగారెడ్డి మహిళా కాలేజీలో ఉర్దూ పరీక్ష రాయడానికి వెళ్లిన విద్యార్థినిలను బురఖాలు తీసివేయాలని ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులు చెప్పారు. బురఖాలు తీసిన తర్వాతే తమను పరీక్ష హాలులోకి అనుమతించినట్లుగా విద్యార్థినులు వాపోయారు.
అయితే.. ఈ విషయంపై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ స్పందించిన తీరు వివాదానికి దారి తీసింది. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవచ్చు.. ఎలాంటివి వేసుకోకూడదనే అంశంపై హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. మహిళలు తమకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చని కానీ యూరోపియన్ల తరహాలో పొట్టి దుస్తులు వేసుకోకూడదంటూ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
అంతేకాదు.. పొట్టి దస్తులు వేసుకునే మహిళలు ఇబ్బందులపాలవుతారని, నిండుగా బట్టలు వేసుకుంటే హాయిగా ఉండవచ్చునని అన్నారు. ఎవరికి నచ్చిన దుస్తులు వాళ్లు వేసుకోవడం తప్పులేదన్న హోం మంత్రి హిందూ మహిళలు లానే ముస్లిం మహిళలు కూడా వీలైనంతవరకు శరీరాన్నికప్పి ఉంచే దస్తులు వేసుకోవడం మంచిదని అన్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల ముంగిట.. కీకలమైన, అత్యంత సున్నితమైన విషయంపై మహమూద్ అలీ ఇలా వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
పరీక్షలు రాయడానికి వచ్చిన ముస్లిం మహిళల బొట్టు, పూలు, గాజులు తీసేసినపుడు హోం మంత్రి మహమూద్ అలీ ఎందుకు స్పందించలేదు – బండి సంజయ్#BandiSanjay pic.twitter.com/0M0E7YZvOs
— Telugu Scribe (@TeluguScribe) June 18, 2023
Telangana Home Minister Mohammed Mahmood Ali sparks controversy, says 'Women should not dress in European style; problem arises when women wear small clothes'. pic.twitter.com/9vIEVkCBk9
— Megh Updates ????™ (@MeghUpdates) June 17, 2023