జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర నిన్న అన్నవరంలో మొదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 25 ఏళ్లు తాను రాజకీయాలు చేయబోతున్నానని, జనసేనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని పవన్ ప్రజలను కోరారు. ఈ సారి గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని, కులాలను చూసి ఓటేయొద్దన్ని కోరారు. తనపై కేసులేమీ లేవని జగన్ ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర నాయకులను గౌరవిస్తానని, కానీ, భయపడబోనని పవన్ అన్నారు.
పవన్ ఎవరికీ భయపడడని గుర్తుంచుకో ముఖ్యమంత్రి జగన్ అంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు. అన్నింటికీ తెగించే వచ్చానని, చేతనైతే మంచిగా పాలించాలని, లేకుంటే తనదైన రోజున కింద కూర్చోబెడతాను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. గాంధీజీలా ఓ చెంప చూపించే రోజులు కావని, ఎదిరిస్తాం అని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తాను అసెంబ్లీలో అడుగుపెట్టకూడదని కుట్రలు చేశారని, కానీ, ఈ సారి తనను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవ్వరూ ఆపలేరని పవన్ శపథం చేశారు. ఈ సారి అసెంబ్లీలో అడుగుపెట్టి తీరతానని అన్నారు.
కాపు నాయకులు ఆలోచించాలని, కాపులను వైసీపీ మోసం చేస్తోందని, కాపుల మధ్య చిచ్చుపెడుతోందని, కాపు నేతలు తమకు అండగా నిలవాలని కోరారు.లో కొందరు తప్పు చేస్తే నిర్మొహమాటంగా తీసేశాను. తన కష్టార్జితంతో, తనను అభిమానించేవారు ఇచ్చే విరాళాలతో పార్టీ నడుపుతున్నానని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీలో పొత్తు పెట్టుకుంటానో ఇప్పుడే చెప్పలేనని, సమయం వచ్చినపుడు చెబుతానని అన్నారు. ముఖ్యమంత్రి పదవి వస్తే సంతోషంగా స్వీకరిస్తానని పవన్ చెప్పారు.
వేలాదిమంది అభిమానించి గౌరవించే మనిషిని జగన్ అవమానించారని, జగన్ సైకో అని చిరంజీవిని ఉద్దేశించి పవన్ మండిపడ్డారు. సినిమా టికెట్ల విషయంలో కూడా చాలా అన్యాయంగా వ్యవహరించారని పవన్ ఫైర్ అయ్యారు. తాను సినిమాలు చేసి సంపాదించే డబ్బుతో పార్టీ నడుపుతున్నానని చెప్పారు. అవినీతి చేసి వేల కోట్లు సంపాదించలేదని జగన్ ను ఉద్దేశించి ఫైర్ అయ్యారు.