ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. “మడమ తిప్పడం అంటే ఇది కాదా జగన్?“ అని వారు ప్రశ్నిస్తున్నారు. మరో 9 మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎప్పుడో 2019 ఎన్నికలకు ముందు సీపీఎస్నురద్దు చేస్తామని చెప్పిన జగన్.. ఇప్పటి వరకు దానిని రద్దు చేయకపోగా.. ఇప్పుడు దాదాపు అంతే స్థాయిలో ఉన్న జీపీఎస్‌ను అమలు చేస్తానని నిర్ణయించడంపై వారు ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీపీఎస్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, అదేసమయంలో ప్రభుత్వ పెన్షన్ స్కీంను అమలు చేసేందుకు వచ్చే అసెంబ్లీలో బిల్లు పెట్టాలని నిర్ణయించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు.
మడమ తిప్పడం అంటే ఇది కాదా? జగన్ అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు నిర్ణయం తీసుకుంది. దీనిపైనే ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగుల కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లు తీసుకురావడం ఏంటని అంటున్నారు. దీనిపై ఉద్యోగులు తమ తఢాకా చూపిస్తామని కూడా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో తెలుస్తుందని బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇక, తాజాగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవీ..
12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం. ఈ ఏడాది అమ్మఒడి పథకం అమలుకు కేబినెట్ ఆమోదం. జగనన్న అమ్మ ఒడి పథకాన్ని జూన్ 28న అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. 2024 జూన్ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగులకు వర్తించేలా దీనిని నిర్నయించారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఎంవోయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని కొత్త మెడికల్ కళాశాలల కు 706 పోస్టుల భర్తీకి కేబినెట్ ఓకే చెప్పింది. పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు అవార్డులు ప్రదానం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.