రెండు రోజులు జరిగిన మహానాడులో కీలకమైన అంశం వచ్చే ఎన్నికల్లో పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఏదో ఒక కీలక ప్రకటన చేస్తారని అందరూ ఎదురు చూశారు. ఎందుకంటే.. ఇప్పటికే విజయవాడలో ఒకసారి.. హైదరాబాద్‌లో రెండు సార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆ యా సందర్భాల్లోనే పొత్తులపై చర్చలు జరిగాయనే ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించ డమే ధ్యేయంగా చంద్రబాబు, పవన్ రంగంలోకి దిగుతున్నారని కూడా అందరూ అన్నారు.
దీనికి దన్నుగా.. పవన్ కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును ఎట్టిపరిస్థితిలోనూ చీలని వ్వబోనని శపథం చేశారు. కలిసి వచ్చే అన్ని పార్టీలనూ కలుపుకొని ముందుకు సాగుతామన్నారు. చివర కు తనకు ముఖ్యమంత్రి పదవిపైనా కాంక్షలేదని పరోక్షంగా ఆ పదవిని కూడా ఆయన వదిలేసుకున్నారు. అంటే.. దీనిని బట్టి.. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉ న్నా.. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారనే సంకేతా లు ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే మహానాడు వేదికగా.. చంద్రబాబు పొత్తులపై కీలక ప్రకటన చేస్తారని అందరూ లెక్కలు వేసుకున్నారు. సీట్లు.. నేతలు.. పార్టీలు.. దీని గురించి చంద్రబాబు చెప్పడం ఖాయమని అనుకున్నారు. కానీ, రెండు రోజుల మహానాడులో చంద్రబాబు ఎక్కడా పొత్తుల మాటే ఎత్తలేదు. పొరుగు పార్టీల ఊసు కూడా తీసుకురాలేదు. మరి దీనిపైచంద్రబాబు వ్యూహం ఏంటి?
ఆయన ఎలాంటి ఆలోచనతో ఉన్నారు? పార్టీ కనుక పుంజుకుని.. ఏకపక్షంగా విజయం దక్కించుకునే పరిస్థితి ఉంటే.. అప్పుడు.. పొత్తులు లేకుండా పోటీ పడి విజయం దక్కించుకోవాలని భావిస్తున్నారా? అనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.