వైసీపీలో కొత్త ముఖాలకు చోటిస్తారని ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతుంది. ప్రెజెంట్ ఉన్న వారికి అందరికీ టికెట్లు ఇస్తామని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్తున్నప్పటికీ నాయకుల్లో అంతర్మథనం సాగుతోంది. ప్రస్తుతం ఉన్నటువంటి సర్వేలు ఎమ్మెల్యేలపై వ్యతిరేకంగా వస్తున్నాయి. అనేకమంది ఎమ్మెల్యేలు పైకి బాగానే ఉన్నారని వైసీపీ అధినేత చెప్తున్నప్పటికీ లోలోన మాత్రం వారి పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది.
అనంతపురం జిల్లాలో దాదాపు ఏడు నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందని వైసిపి అధినేత భావిస్తున్నారు. ఇప్పటికే నిర్వహించిన ఐపాక్ సర్వేలు కూడా వైసీపీకి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారిలో వ్యతిరేక కనిపిస్తోందని ప్రజలు వారిని ఒప్పుకోవడం లేదని తెలిసినట్టు పేర్కొన్నాయి. అంతేకాదు. ఆయా నియోజకవర్గాలు టిడిపికి బలమైన నియోజకవర్గాలుగా మారుతున్నాయని కూడా సమాచారం అందించాయి.
దీంతో ఆయా నియోజకవర్గాలను గమనిస్తే వైసిపిలో మార్పు తప్పదు అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి దాదాపు 20 నియోజకవర్గాల్లో కొత్తముఖాలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఛాన్స్ ఇస్తారని అంటున్నా రు. అయితే ఆ కొత్తవారా? వారసులా? లేకపోతే పార్టీలో పనిచేస్తున్నవారా? అవకాశాలు దక్కని వారా? జగన్మోహన్ రెడ్డి అనుచరులా అనే విషయంపై సందేహాలు కొనసాగుతున్నాయి.
వారసులు ఇప్పటికే కొంతమందికి టికెట్లు ఖరారు చేశారని కూడా తెలుస్తోంది. ఇప్పటికే స్పీకర్ తమ్మినేని కుమారుడికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.తన కుమారుడు పోటీ చేస్తారని స్పీకర్ తమ్మినేని సీతారాం స్వయంగా చెబుతున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం లో తన కుమార్తెను ప్రకటించుకున్నారు ఎమ్మెల్యే ముస్తఫా. ఇక రాయలసీమలో కూడా వైసిపికి వారసులు ఎక్కువమంది కనిపిస్తున్నారు. దీన్నిబట్టి మరి కొత్త ముఖాలు అంటే వారసులేనా లేకపోతే ఏ మాత్రం గుర్తింపు లేని గతి ఎన్నికల్లో ఇచ్చినట్టు కొత్తవారికి ఇస్తారా? ఏదైనా కొత్త ఫార్ములా అమలు చేస్తారా అనేది ఆసక్తిగా మారింది.
అయితే 20 నియోజకవర్గాల్లో కొత్త వారికి మార్పు ఇవ్వటం అంటే అంత ఈజీ విషయం కాదుజ ఎందుకంటే బలమైన టిడిపిని ఢీకొట్టేటటువంటి స్థాయిలో ఆర్థికంగా కానీ సామాజికపరంగా కానీ ప్రజల్లో బలంగా ఉన్నటువంటి నాయకులకు మాత్రమే అవకాశం ఇస్తారని వైసీపీలో చర్చి నడుస్తుంది. ప్రస్తుతం 20 నియోజకవర్గాలు అంటున్నప్పటికీ ఎన్నికల నాటికి ఇంకో రెండు మూడునియోజకవర్గాలు పెరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.