గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం.. చిలకలూరి పేట. ఈ నియోజకవర్గం నుంచి 2009, 2014లో విజయం దక్కించుకున్న టీడీపీ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు. తర్వాత..చంద్రబాబు కేబినెట్లో ఐదే ళ్ల పాటు మంత్రిగా కూడా పనిచేశారు. గత 2019 ఎన్నికల్లో వైసీపీఅభ్యర్థి, ప్రస్తుత మంత్రి విడదల రజనీ చేతిలో ఆయన ఓడిపోయారు. తర్వాత కొన్నాళ్లు హడావుడి చేశారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
అయితే.. ఇటీవల ఏడాదిన్నర కాలంగా మాత్రం ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గంలో కనిపించడం లేదు. అంతేకాదు.. ఎక్కడా కార్యక్రమాలు కూడా చేయడం లేదు. ఈ విషయంపై ఇతరుల కన్నా కూడా.. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ఆరా తీశారు. గుంటూరులో పార్టీ బలంగా పుంజుకోవాలని.. కుదిరితే మాచర్ల మినహా.. అన్ని నియోజకవర్గాలను దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో పుల్లారావు విషయంపై ఆయన ఆరా తీశారు.
దీంతో కొన్ని కొన్ని విషయాలు వెలుగు చూశాయని అంటున్నారు. మంత్రి గా ఉన్న సమయంలో కొన్ని పురుగు మందుల దుకాణాలకు.. ఆయన విచ్చలవిడిగా లైసెన్సులు ఇచ్చారని.. వాటిపై ప్రస్తుత ప్రభు త్వం డేగ కన్ను సారించిందని.. పుల్లారావు పుంజుకుంటే.. వాటిని బయటకు తీసి.. లేనిపోని విధంగా హరా ష్ చేయడం ఖాయమని తేలిందట. నిజానికి పుల్లారావుపై.. టీడీపీ హయాంలోనే విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఆయనసతీమణి .. తేనె వెంకాయమ్మ శైలిని టీడీపీ నాయకులు సైతం దుయ్యబట్టారు.
ఇక,… ఇప్పుడు విడదల రజనీ మంత్రిగా ఉండడంతో పాత వాటిని తిరగదోడుతున్నారని.. తెలుస్తోంది. ఈ విషయం నేపథ్యంలోనే పుల్లారావు సైలెంట్ అవుతున్నారని పార్టీలోనే చర్చ సాగుతో్ంది. అయితే.. పార్టీ వర్గాలు మాత్రం పుల్లారావు అనారోగ్యంతో ఉన్నారని.. అందుకే పార్టీకి దూరంగా ఉంటున్నారని చెబుతు న్నారు. ఒకప్పుడు బలమైన గళంతో వైసీపీపై విమర్శలు గుప్పించిన పుల్లారావు.. ఇప్పుడు సైలెంట్ కావడం.. మాత్రం నియోజకవర్గంలో చర్చకు దారితీస్తోంది. మరి వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఎలా పుంజుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.