ఏపీ సీఎం జగన్ చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యపై అనేక కోణాల్లో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే.. ఈ కేసుకు సంబందించి రోజుకో వార్త వెలుగు చూస్తోంది. కొన్ని మీడియా ఛానెళ్లలో వచ్చిన సమాచారం నిజమో కాదో తెలియదు కానీ.. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం జోరుగా చర్చ సాగుతోంది. హత్య జరిగిన రోజు తెల్లవారు జామున ప్రతిపక్షంలో ఉన్న జగన్.. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఎన్నికల వ్యూహంపై ముగ్గురితో చర్చిస్తున్నారని ప్రచారంలో ఉంది.
ఈ ముగ్గురిలో ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారి అజేయ కల్లం, మరో వ్యక్తి వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. వీరితో తెల్లవారు జామున చర్చిస్తున్న సమయంలో ఫోన్ వచ్చిందని.. వివేకానందరెడ్డి గుండె పోటుతో మరణించారన్నది వార్త. ఈ వార్త తెలిసిన తర్వాత.. సహజంగానే ఎవరైనా.. తమ కుటుంబ సభ్యుడికి ఇలా జరిగితే.. ఉన్న పళాన చేస్తున్న పనిని పక్కన పెట్టి ఆ విషయంపై దృష్టి పెడతారు. కానీ, జగన్ అప్పట్లో అలా చేయలేదని.. వార్తలు వచ్చాయి.
నింపాదిగా చర్చల్లో మునిగిపోయారని.. తర్వాత ఎప్పుడో 6 గంటలకు బయలు దేరి.. 8 గంటల సమయంలో పులివెందులకు వెళ్లారని.. అప్పట్టోనూ వార్తలు వచ్చాయి. ఇదే ఇప్పుడు నెటిజన్లు హాట్ హాట్‌గా చర్చిస్తు న్నారు. గుండెపోటు విషయం హఠాత్తుగా జగన్ కు తెలిసిన నేపథ్యంలో ఆయన వెంటనే రియాక్ట్కావాలి కదా.. కానీ, అలా కాకుండా.. ఎందుకు చర్చల్లో మునిగిపోయారు? అనేది కీలక ప్రశ్న. బాబాయి కన్నా ఎన్నికలే ప్రధానం అనుకున్నారా?
లేక.. ఈ విషయం ముందే ఆయనకు తెలుసా? అనేది ఇప్పుడు నెటిజన్ల మధ్య సాగుతున్న చర్చ. ఏదేమైనా.. ఈ విషయంలో తాజాగా అజేయ కల్లంను ఓ సీబీఐ అధికారి విచారించినట్టు వార్తలు రావడం.. దానికి ఆయన నిజమే.. మేం కలిసి కూర్చుని ఎన్నికలపై చర్చిస్తున్న సమయంలో ఫోన్ వచ్చిందని.. అయితే.. సమయం గుర్తు లేదని.. చెప్పడం.. మరింత బలాన్నిస్తోంది. ఏదేమైనా.. కొన్ని కొన్ని రహస్యాలు దేశంలో ఇప్పటికీ మిస్టరీలుగానే ఉన్నాయి. బహుశ ఇది కూడా ఆ జాబితాలో చేరుతుందేమోనని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.