తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైసీపీ గ్యాంగ్ విరుచుకుపడింది. నిజానికి ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు. ఆయన రాజకీయాల్లోనూ లేరు. అక్కడ తమిళనాడు అయినా.. ఇక్కడ ఏపీలో అయినా.. ఆ మాటకు వస్తే.. దేశంలో కూడా.. ఏ పార్టకీ రజనీ సపోర్టు చేయడం లేదు. అయినా.. కూడా వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబును, ఎన్టీఆర్‌ను కొనియాడిన అంశంపై నోటికి ఇష్టం వచ్చినట్టు .. మాజీ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. ఇక, మంత్రి రోజా కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్టుగా వ్యవహరించారు.
అయితే.. ఇలా వైసీపీ వెంటనే ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చింది? ఎందుకు ఇంత ఆందోళన చెందాల్సి వచ్చింది? అనేది ఆసక్తికర ప్రశ్న. ఎందుకంటే.. తమిళ సూపర్ స్టారే అయినా.. కూడా.. రజనీకి రాష్ట్రంలోనూ ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఆయన తెలుగులోనే మాట్లాడారు కాబట్టి.. ఆయన మాటలు సామాన్యుల్లోకి కూడా బాగానే ఎక్కాయి. పైగా మాస్ ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్ . దీంతో సహజంగానే టీడీపీ అధినేతను విజనరీ ఉన్న నాయకుడు అని.. 2040 నాటికి.. ఆయన రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకువెళ్లాలనే లక్ష్యం పెట్టుకున్నారని చెప్పడం.. వైసీపీకి ఏమాత్రం రుచించలేదు.
అంతేకాదు..చంద్రబాబు విజన్ కారణంగానే నేడు సైబరాబాద్ వచ్చిందని, బిల్‌గేట్స్‌ను ఆయన ఏపీకి తీసుకురాగలిగారని.. ఆయనకు ఏపీపై మరింత దూరదృష్టి ఉందని.. ఆయన అనుకున్నది(ఇప్పుడు) కనుక సాకారం అయితే.. ఏపీ 2040 నాటికి దేశంలోనే అత్యంత అగ్రగామి రాష్ట్రం అవుతుందని.. రజనీ చెప్పారు. ఇది.. సహజంగానే మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి.. మేదావి వర్గాలను ఆలోచనలో పడేసింది. ఇప్పటి వరకు చంద్రబాబు చెప్పినా.. పెద్దగా పట్టించుకోని వారు.. రజనీ వంటి క్లీన్ ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్ చెబితే.. ఖచ్చితంగా తలకెక్కించుకుంటారు.
ఈ గుబులే .. వైసీపీకి నిద్రపట్టకుండా చేసింది. ఇపప్పటి వరకు చంద్రబాబును తాము డమ్మీ చేస్తున్నామని.. ఏమీ లేదని, ఆయనదంతా గ్రాఫిక్స్ అని ప్రచారం చేస్తున్నామని.. కానీ.. ఇప్పుడు రజనీ వచ్చి.. తమ ప్లాన్ అంతా దెబ్బతీశాడని వైసీపీ నేతలకు కడుపు రగిలిపోతోంది. అందుకే.. ఆయనపై మాటల తూటాలు పేల్చారు. అయితే..రజనీ ఇలాంటి వారిని ఎంతో మందిని చూసి ఉంటారు. పైగా, ఆయనకు తెలుసు ఎవరు ఏంటో.. అదికూడాకాక.. రజనీ వంటి విశ్వసనీయ వ్యక్తులు చెప్పిన తర్వాత.. వైసీపీ నేతలు ఎన్ని చెప్పినా.. ప్రజలు వినిపించుకునే పరిస్థితిలో లేరని అంటున్నారు పరిశీలకులు.