తెలంగాణ బీజేపీ చీఫ్.. ఫైర్ బ్రాండ్ నాయకుడు బండి సంజయ్ జైలు పాలయ్యారు. ఆయనను తెలంగాణ పోలీసులు ఖమ్మం జైలుకు తరలించారు. దీంతో తెలంగాణలో బీజేపీ నాయకులు నిరసనలు ముమ్మరం చేశారు. వివరాలు.. ఇవీ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేయడం.. రాష్ట్రంలో దుమారం రేపింది.
పేపర్ లీక్ కేసులో 9 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు సంజయ్‌ను ఏ1గా చేర్చారు. ఆయనతో పాటు మరో 8 మందిని నిందితులుగా చేర్చినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. విద్యార్థుల్లో గందరగోళం సృష్టించేందుకు బండి సంజయ్ కుట్ర చేశారని ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 120బి, 420, 447, 505 సెక్షన్ల కింద సంజయ్‌పై కేసులు నమోదు చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు.
8 పేజీలతో కమలాపూర్ పోలీసులు రిమాండ్ రిపోర్టు తయారు చేశారు. బండి సంజయ్ అనుచరులే పేపర్ లీక్ చేశారని పోలీసులు తెలిపారు. సంజయ్ ప్రోత్సాహంతోనే పేపర్ లీక్ జరిగినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారని న్యాయవాది పేర్కొన్నారు. అలాగే సంజయ్‌కు ప్రశ్నపత్రం వాట్సప్ చేసిన ప్రశాంత్‌ను పోలీసులు ఏ2గా రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఈ వ్యవహారంలో నలుగురిని అరెస్టు చేశామన్న పోలీసులు.. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఇక, సంజయ్‌ను తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలీసులు హనుమకొండ కోర్టులో హాజరుపర్చారు. బండి సంజయ్‌ను పోలీసులు హనుమకొండ కోర్టు వెనుక వైపు నుంచి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన కోర్టు సంజయ్‌కు ఈ నెల 19 వరకు అంటే.. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో సంజయ్‌ను ఖమ్మం జైలుకు తరలించారు.
మొహంలో అదే చిరునవ్వు, అదే ఉత్సాహం. ఎంత మంది కేసిఆర్ లు ఎన్ని కుట్రలు చేసినా బెదరని మా ఉక్కు మనిషి, మా కాషాయ దళపతి బండి సంజయ్ కుమార్ ✊
భారత్ మాతా కీ జై ???? pic.twitter.com/PrqiGZZbRl— A.Venkata Ramana (Modi ka Parivar) (@AVRBJP) April 5, 2023