ఇటీవల ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైసీపీలో లుకలుకలు బయటపడిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగానే వైసిపి అధినేత జగన్ పై పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలకు అసంతృప్తి ఉందని విమర్శలు వచ్చాయి పార్టీ సస్పెండ్ చేసిన నలుగురు కాకుండా దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే అదంతా పుకార్లేనని వైసిపి నేతలు కొట్టి పారేశారు.
కానీ తాజాగా ఆ పుకార్లకు మోహితం ఇచ్చేలాగా సాక్షాత్తు సీఎం జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశానికి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు గైర్ హాజరు కావడం సంచలనం రేపుతోంది. దీంతో, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల ముందు వరకు ఎమ్మెల్యేలతో గంభీరంగా ఉన్న జగన్…తాజాగా జరిగిన సమావేశంలో మారిపోయారు. మొన్నటిదాకా దూకుడుగా ఉన్న జగన్…ఎమ్మెల్యేల విషయంలో ఆత్మరక్షణలో పడ్డట్లు కనిపిస్తోంది.
గతంలో ఎమ్మెల్యేలకు హుంకరింపులు…నేడు వేడుకోళ్ల అన్నరీతిలో జగన్ తీరు మారిందట. ఈ సమావేశంలో జగన్ పూర్తిగా డిఫెన్స్ లో ఉన్నారట. ఎమ్మెల్యేలంటే డోంట్ కేర్ అన్న జగన్…తాజాగా ఏ ఒక్క ఎమ్మెల్యేను వదులుకోనంటూ ఆప్యాయత కురిపించారట. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోతే..ఎమ్మెల్సీనో, తత్సమాన నామినేటెడ్ పదవో ఇస్తానని హామీలు కురిపించారట. ఇక, ఈ సమావేశానికి దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. కొన్ని కారణాలతో రాలేకపోయిన కొద్ది మందిని మినహాయిస్తే మిగతా ఎమ్మెల్యేలు సమావేశానికి డుమ్మా కొట్టారని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా జగన్ తాజా తీరుతో వైసీపీ ఎమ్మెల్యేలు షాక్ కు గురయ్యారట.